సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

ABN, First Publish Date - 2023-03-28T13:42:33+05:30

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే.. నార్మాలా? సరొగసీనా? (Surrogacy) అనేలా టాక్ నడుస్తుంది. అందుకు కారణం నయనతారతో పాటు బాలీవుడ్‌లో కొందరు ప్రముఖ హీరోయిన్లు ఈ బాట పట్టడమే. ఇక మెగా కోడలు..

UpasanaUpasana Konidela
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే.. నార్మాలా? సరొగసీనా? (Surrogacy) అనేలా టాక్ నడుస్తుంది. అందుకు కారణం నయనతారతో పాటు బాలీవుడ్‌లో కొందరు ప్రముఖ హీరోయిన్లు ఈ బాట పట్టడమే. ఇక మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Ram Charan Wife Upasana) ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత.. ఆమెపై ఏ విధంగా వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ముఖ్యంగా ఆమె కూడా సరొగసీ విధానాన్నే ఎంచుకుందా? అనేలా కొందరు లేని పోని వార్తలను వైరల్ చేశారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచి గుడ్ న్యూస్ వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ ఉపాసన (Upasana) మాత్రం నార్మల్‌గానే కనిపిస్తూ.. అమెరికా, ఢిల్లీ అంటూ అటు, ఇటు తిరిగేస్తుందనేలా ఆమె గురించి రాసుకొచ్చారు. ఇలా రూమర్స్‌ను క్రియేట్ చేస్తూ.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారందరికీ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ (Ram Charan Birthday Bash) వేడుక.. కనువిప్పుగా మారింది.

పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత ఉపాసన, రామ్ చరణ్ దంపతులు (Ram Charan and Upasana) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి, మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆ ఆనందం అనుభవించే లోపే.. సరొగసి అంటూ కొందరు పుట్టించిన వార్తలు మెగా ఫ్యామిలీని ఇబ్బందికి గురిచేసినా.. వారు మాత్రం ఎక్కడా ఆ రూమర్స్‌పై పెదవి విప్పలేదు. అసలు విషయం వారికి తెలుసు కాబట్టి.. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు కాబట్టి.. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయినా రూమర్స్ మాత్రం ఆగలేదు. కానీ ఇప్పుడు అలాంటి అనుమానాలు వ్యక్తం చేసే వారందరికీ చెంపపెట్టులా రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పటి వరకు ఉపాసన.. తన బేబీ బంప్ (Upasana Baby Bump) ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ.. లూజైన అవుట్ ఫిట్స్‌తో కవర్ చేస్తూ వచ్చింది. కానీ సోమవారం రాత్రి జరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో బేబీ బంప్ కనిపించేలా ఉపాసన టైట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. రామ్ చరణ్‌తో కలిసి ఉపాసన ఇలా కనిపించిన ఫొటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేసిన వారందరి నోళ్లు మూగబోతే.. మెగా ఫ్యాన్స్ మాత్రం యమా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) తమ వారసుడిని ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తారా? అని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉపాసన డెలివరీ డేట్ (Upasana Delivery Date) ఆగస్టు 20కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 22 విశిష్టత ఏమిటో మెగా ఫ్యాన్స్‌కి తెలియంది కాదు. మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనేలా వెంటవెంటనే మెగా ఇంట రెండు పండగలు రాబోతున్నాయన్నమాట. ప్రస్తుతానికైతే ఉపాసన బేబీ బంప్ ఫొటోలు (Upasana Baby Bump Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

*********************************

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-28T13:42:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!