NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

ABN , First Publish Date - 2023-05-17T19:38:07+05:30 IST

‘సముద్రం నిండా రక్తంతో రాసిన ఆయన కథలే..’ అంటూ NTR30 (#NTR30)కి సంబంధించి మేకర్స్ ఓ పవర్‌ఫుల్ అప్‌డేట్‌ని ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) హీరోగా.. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న

NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..
NTR30 First Look Release Date Announcement

‘రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..’ అంటూ NTR30 (#NTR30)కి సంబంధించి మేకర్స్ ఓ పవర్‌ఫుల్ అప్‌డేట్‌ని ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) హీరోగా.. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘NTR30’. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri KalyanRam) స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌ (NTR Arts), యువ సుధ ఆర్ట్స్ (Yuva Sudha Arts) బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20)ను పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మే 19న విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. (NTR30 First Look Release Date)

ఈ పోస్టర్‌లో సముద్రపు ఒడ్డున నెత్తుటితో నిండిన రకరకాల కత్తులు గుచ్చబడి ఉన్నాయి. ఈ కత్తులకు అంటిన నెత్తురు.. ఆయన రాసిన కథలకు సాక్ష్యాలు అన్నట్లుగా పోస్టర్‌ని రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. అలాగే ఎన్టీఆర్ అభిమానులకు ఓ పవర్‌ఫుల్ సందేశం కూడా ఇస్తోంది. ఈసారి మాములుగా రావడం లేదనే సంకేతాన్ని ఈ పోస్టర్ వారికి తెలియజేస్తుంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు వారు చాలా నిరాశలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే సినిమా సెట్స్‌పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి వినిపిస్తున్న టాక్‌తో వారంతా హ్యాపీగా ఉన్నారు. ఇక రాబోయే ఫస్ట్ లుక్‌ అయితే వాళ్లకి ఫుల్ మీల్స్ పక్కా అనేలా.. ఇప్పుడొచ్చిన అప్‌డేట్ తెలియజేస్తోంది.

NTR-30-Look.jpg

ఇంతకు ముందు ఓపెనింగ్ ఫంక్షన్‌లో కొరటాల చెప్పినట్లే.. ఇప్పుడొచ్చిన ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉండటం విశేషం. ‘‘ఎన్టీఆర్‌‌తో సెకండ్‌ టైమ్‌ సినిమా చేస్తున్నాను. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ జెనరేషన్‌ బెస్ట్ యాక్టర్‌ ఎన్టీఆర్‌. నా బ్రదర్‌ ఆయన. సినిమా ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌లో సెట్‌ అయిన కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒక్కడంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌. చాలా బిగ్‌ మూవీ అవుతుంది. ఈ సినిమా నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్‌ చేస్తున్నా..’’ అని కొరటాల చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్టే.. ‘NTR30’ ఒక్కో అప్‌డేట్ అభిమానుల అంచనాలని తారా స్థాయికి తీసుకెళుతోంది. ఇక రాబోయే ఫస్ట్ లుక్‌తో కొరటాల చెబుతున్న సముద్రంలో ఎటువంటి సునామీ రాబోతోందో చూడాలి.


ఇవి కూడా చదవండి:

************************************************

*Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

*Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు అభ్యంతరం.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు

*Vijay Antony: ‘పిచ్చైక్కారన్‌’.. నాకు ఆయన వేసిన భిక్ష

*Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

*PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Updated Date - 2023-05-17T19:39:11+05:30 IST