Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

ABN , First Publish Date - 2023-03-22T22:45:28+05:30 IST

కెజియఫ్ (KGF) తర్వాత కన్నడ (Kannada Cine Industry) నుంచి వచ్చిన ‘కాంతార’ (Kantara) చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. కాసుల వర్షాన్ని కురిపించింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం..

Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
Kantara Movie Still

కెజియఫ్ (KGF) తర్వాత కన్నడ (Kannada Cine Industry) నుంచి వచ్చిన ‘కాంతార’ (Kantara) చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. కాసుల వర్షాన్ని కురిపించింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు జనాలు నీరాజనాలు పట్టారు. ఈ చిత్రం సాధించిన విజయంతో.. వెంటనే సీక్వెల్ కూడా ప్రకటించారు. హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films) ఈ సీక్వెల్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ‘కాంతార 2’ (Kantara 2)కు సంబంధించి కొన్ని రోజులుగా వార్తలే కానీ.. అఫీషియల్ అప్‌డేట్ మాత్రం మేకర్స్ నుంచి రాలేదు. ఉగాది (Ugadi) పండుగను పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర కీలక అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

దర్శకుడు, హీరో అయిన రిషబ్ శెట్టి ‘దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాంతార (Kantara) రచన మొదలైంది’ అని ట్వీట్ చేయగా.. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ కూడా ‘కాంతార2’ అప్‌డేట్‌ను పంచుకుంది. ట్విట్టర్ వేదికగా.. ‘శుభప్రదమైన ఉగాది, కొత్త సంవత్సరంను పురస్కరించుకుని ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కాంతార 2 స్క్రిప్ట్‌ పనులు మొదలయ్యాయి. ప్రకృతితో ఉన్న మనోహరమైన అనుబంధాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నాం. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి’ అని అధికారికంగా నిర్మాతలు పేర్కొన్నారు. (Hombale Films About Kantara 2)

ఈ అప్‌డేట్‌తో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఈ పార్ట్‌లో రజనీకాంత్ (Rajinikanth) చేయబోతున్నారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. రిషబ్ శెట్టి.. సూపర్ ‌స్టార్‌ (Super Star)ని కలవడంతో, ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. దీంతో ‘కాంతార’ అభిమానులందరూ.. ఈ సీక్వెల్‌లో ఎవరు హీరోగా చేస్తారనే విషయంపై ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ కోసం హోంబలే సంస్థ కూడా భారీగా బడ్జెట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మొదటి పార్ట్‌తో భారీ లాభాలను అందుకున్న హోంబలే సంస్థ.. రెండో పార్ట్‌ని ఏ విషయంలోనూ తగ్గకుండా.. ఏది కావాలంటే అది దర్శకుడికి సమకూర్చేలా.. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ విషయంలో కూడా ఓ స్టార్ హీరోయిన్‌ని ఈ సినిమా కోసం తీసుకోబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి ఇటువంటి వార్తలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం.. మళ్లీ మేకర్స్ అధికారికంగా తెలియజేసే వరకు వెయిట్ చేయాల్సిందే. (Kantara 2 Update)


ఇవి కూడా చదవండి:

*********************************

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

*Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-22T22:45:31+05:30 IST