VNRTrio: ‘భీష్మ’ కాంబినేషన్‌లో మూవీ ప్రారంభం.. ఎవరెవరు అతిథులుగా వచ్చారంటే?

ABN , First Publish Date - 2023-03-24T15:37:16+05:30 IST

సక్సెస్‌ ఫుల్ కాంబినేషన్‌‌లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి కాంబినేషన్‌లో సినిమా మళ్లీ వస్తుందీ అంటే.. ఖచ్చితంగా క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి క్రేజే..

VNRTrio: ‘భీష్మ’ కాంబినేషన్‌లో మూవీ ప్రారంభం.. ఎవరెవరు అతిథులుగా వచ్చారంటే?
Megastar Chiranjeevi Claps to VNRTrio Film

సక్సెస్‌ ఫుల్ కాంబినేషన్‌‌లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి కాంబినేషన్‌లో సినిమా మళ్లీ వస్తుందీ అంటే.. ఖచ్చితంగా క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి క్రేజే.. #VNRTrio- వెంకీ కుడుముల (Venky Kudumula), నితిన్ (Nithiin), రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతున్న చిత్రంపై ఏర్పడింది. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే క్యూరియాసిటీని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. శుక్రవారం ప్రారంభోత్సవం కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. ముఖ్యంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్స్ బాబీ (Bobby), గోపీచంద్ మలినేని (Gopichand Malineni), హను రాఘవపూడి (Hanu Raghavapudi), బుచ్చిబాబు (Buchibabu Sana) వంటి వారు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ ఎత్తున నిర్మించనుంది.

VNRTrio-4.jpg

వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ (Bheeshma) చిత్రం సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్‌గా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ముహూర్తం షాట్‌‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ మలినేని తొలి షాట్‌‌కి గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్క్రిప్ట్‌‌ని మేకర్స్‌‌కి అందజేశారు.

VNRTrio-1.jpg

నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Y Ravi Shankar) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఈ చిత్రంలో భాగం కానున్నారు. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించనున్నారనే విషయం అనౌన్స్‌మెంట్ వీడియోలోనే మేకర్స్ తెలిపారు.

VNRTrio-3.jpg

వాస్తవానికి వెంకీ కుడుమల తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో చేయాలి. అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ సినిమా అటకెక్కింది. ఆ ప్లేస్‌లోనే ఇప్పుడు వెంకీ కుడుమల.. మరోసారి నితిన్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. వెంకీ కుడుమలతో సినిమా చేయకపోయినా.. మొదటి నుంచి ఆయన సినిమాలకు చిరంజీవి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడీ చిత్ర ఓపెనింగ్‌కు వచ్చి.. క్లాప్ కొట్టి మరోసారి మెగాస్టార్ తన సపోర్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. అలాగే ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లోనే నిర్మాణం జరుపుకుంది.

VNRTrio-2.jpg

ఇవి కూడా చదవండి:

*********************************

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-24T15:37:18+05:30 IST