Tollywood: శోభకృత్.. టాలీవుడ్‌లో అప్‌డేట్స్ ఇవే..

ABN , First Publish Date - 2023-03-22T21:43:03+05:30 IST

శోభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని.. టాలీవుడ్ మేకర్స్ తమ చిత్రాల అప్‌డేట్‌తో సందడి చేశారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. న్యూ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఓపెనింగ్స్, పాటల రిలీజ్, టీజర్ రిలీజ్ వంటి అప్‌డేట్స్‌తో

Tollywood: శోభకృత్.. టాలీవుడ్‌లో అప్‌డేట్స్ ఇవే..
Ugadi Special Tollywood Updates

శోభకృత్ (Sobhakritu) నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని.. టాలీవుడ్ మేకర్స్ (Tollywood Makers) తమ చిత్రాల అప్‌డేట్‌తో సందడి చేశారు. ఉగాది శుభాకాంక్షలు (Ugadi wishes) చెబుతూ.. న్యూ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఓపెనింగ్స్, పాటల రిలీజ్, టీజర్ రిలీజ్ వంటి అప్‌డేట్స్‌తో టాలీవుడ్ (Tollywood) కళకళలాడింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. టాలీవుడ్‌లో జరిగిన మేజర్ అప్‌డేట్స్ విషయానికి వస్తే..

Mega-Power.jpg

సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ (Mega Power) చిత్రం ప్రారంభం

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ‘మెగా పవర్‌’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైంది. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. యాక్షన్‌ సీన్స్‌ కోసం తగిన జాగ్రత్తలతో హీరో శిక్షణ పొందారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్‌ చేస్తాం. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

************************************************************

Screen-Play.jpg

‘స్క్రీన్‌ప్లే’ (Screenplay) చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ

పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్లపై హరికృష్ణ జినుకల సమర్పణలో అంకుర్ కసగోని (Ankur Kasagoni) దర్శకత్వంలో పల్లె అనిల్ నిర్మిస్తున్న చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ఈ సినిమా టైటిల్ లోగోను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నట్లు నిర్మాత తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకులు తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

************************************************************

Parari.jpg

‘పరారి’ (Paraari) మూవీలో ‘ఏమో ఏమో’ పాటను రిలీజ్ చేసిన లేడీ సూపర్ స్టార్

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్‌లో.. గాలి ప్రత్యూష సమర్పణలో యోగిశ్వర్, అతిధి జంటగా.. సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఈ చిత్రంలోని ఏమో ఏమో సాంగ్‌ని పొలిటీషియన్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Lady Super Star Vijayashanti విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. యోగిశ్వర్ ఫస్ట్ ఫిలిం అయిన డ్యాన్స్ బాగా చేశాడు.. సక్సెస్ అవుతాడని భావిస్తున్నాను. ప్రజలందరూ యోగిని ఆశీర్వదించాలి. ‘పరారీ’ సినిమాను కూడా అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జివివి గిరి, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, హీరో యోగిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

*************************************************************

Rangabali.jpg

నాగశౌర్య, పవన్ బాసంశెట్టి, సుధాకర్ చెరుకూరి, ఎస్‌‌ఎల్‌‌వి సినిమాస్ టైటిల్ ‘రంగబలి’ (Rangabali)

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య విభిన్నమైన జానర్స్‌తో అలరిస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఉగాది సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్‌‌ను అనౌన్స్ చేశారు. ‘రంగబలి’ అనే టైటిల్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్‌‌గా ఈ సినిమా వుండబోతోందని అనౌన్స్‌మెంట్ వీడియోని చూస్తే అర్ధమౌతోంది. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పని చేస్తున్న మొత్తం టీమ్ సొంత ఊర్లు పేర్లు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో ప్రస్తావించడం ఆసక్తికరంగా వుంది.

************************************************************

Samajavaragamana.jpg

శ్రీవిష్ణు ‘సామజవరగమన’ (Samajavaragamana) మే 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల

శ్రీవిష్ణు కథానాయకుడిగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు‌కు జోడీగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మే 18న వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సామజవరగమన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ప్లజంట్‌గా ఉంది. శ్రీవిష్ణు కుటుంబంలోని అందరు ఆడవాళ్లతో కలిసి కనిపించారు.

************************************************************

Rudrudu.jpg

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ (Rudrudu) నుంచి ‘భగ భగ రగలరా’ పాట విడుదల

యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ చిత్రం పాన్ ఇండియా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాకు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. తాజాగా ‘రుద్రుడు’ నుంచి భగ భగ రగలరా పాటని విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని రుద్రుడు టైటిల్, పాత్రకు జస్టిఫికేషన్‌గా చాలా పవర్ ఫుల్‌గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్రుడిగా లారెన్స్ ప్రజన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్‌గా పాడారు. లారెన్స్‌కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.

************************************************************

Ravanasura.jpg

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ (Ravanasura) నుంచి మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్ టీజర్‌‌తో క్యురియాసిటీని పెంచింది. టీజర్ రవితేజని డిఫరెంట్ షేడ్స్‌లో ప్రజంట్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌‌గా రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్ నెంబర్స్‌గా అలరిస్తున్నాయి. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన రావణాసుర మాస్ పార్టీ సాంగ్ ‘డిక్కా డిష్యూం’ని మేకర్స్ విడుదల చేశారు. విన్న వెంటనే హై ఎనర్జీ ఇచ్చే మాస్ డ్యాన్సింగ్ పార్టీ నెంబర్ ఇది. రవితేజ చేసిన మాస్ మూమెంట్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్ పార్టీ‌ని ఎలివేట్ చేస్తూ క్యాచిగా ఆకట్టుకుంటే.. స్వాతి రెడ్డి యూకే, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిండ్ల ముగ్గురూ కలసి ఈ పాటని హుషారుగా అలపించారు. థియేటర్‌లో డిక్కా డిష్యూం మాస్ సందడి నెక్స్ట్ లెవల్‌లో వుంటుందనేలా ఈ పాట ఉంది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

************************************************************

Miss-shetty.jpg

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి మహేష్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించింది. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రధన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎమ్ఎమ్ మానసి ఆలపించారు. ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళలంటూ తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా..పేరంటాలే పడదంటా..’ అంటూ సాగే ఈ గీతం హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను తెలియజేసేలా ఉంది. స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది. అటు రధన్ అందించిన ట్యూన్ కూడా చాలా క్యాచీగా వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఆ ట్యూన్ అంతే అందంగా పాడింది ఎమ్ఎమ్ మానసి. పాటను బట్టి చూస్తే హీరోయిన్‌పై సాగే మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక ఈ వేసవి బరిలో తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఈ పాట ఓ కొత్త ఊపుతో మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

*****************************************************

Kalyan-Ram.jpg

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ (Kalyan Ram Devil)

డిఫ‌రెంట్ మూవీస్‌, క్యారెక్ట‌ర్స్ చేస్తూ హీరోగా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్‌లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో క‌ళ్యాణ్ రామ్ డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక చేతిలో ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఉన్నారు. మ‌రో చేతిలో గ‌న్‌తో షూట్ చేస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో అల‌రించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ తెలపనున్నారు.

*****************************************************

Selfish.jpg

కొత్త పోస్టర్‌తో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ‘సెల్ఫిష్’ (Selfish) టీమ్

తొలి చిత్రం ‘రౌడీ బాయ్‌’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ కోసం నూతన దర్శకుడు కాశీ విశాల్‌తో జతకట్టారు. సుకుమార్ రైటింగ్స్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆశిష్ రెడ్డి నోట్లో బీడీతో తన నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ప్రజంట్ చేసింది. గిరజాల జుట్టు, గడ్డంతో, తెల్లటి చొక్కా, ఆరెంజ్ కలర్ జీన్స్‌లో మాసీగా కనిపిస్తున్నాడు ఆశిష్. ఈ సినిమా కోసం ఆశిష్ మంచి ఫిజిక్ బిల్డ్ చేసుకున్నారు. ఫస్ట్ లుక్‌లో రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోని మ్యాప్‌ను సూచిస్తున్నట్లుగా.. ఈ సినిమా కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

******************************************************

Saindav.jpg

విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ (Saindhav) రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ప్రారంభం

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌‌లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్‌గా నడుస్తూ కనిపించారు. సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

****************************************************************

‘స్లమ్ డాగ్ హస్బెండ్’ (Slum Dog Husband) మోషన్ పోస్టర్ వదిలిన విజయ్ దేవరకొండ

సంజయ్ రావు (Sanjay Rao) హీరోగా మైక్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. కామికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

*Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-23T12:13:13+05:30 IST