Sai Pallavi: నేను స్టార్‌ను కాదు

ABN , First Publish Date - 2023-03-31T16:16:24+05:30 IST

మలయాళంలో తొలి సినిమా ‘ప్రేమమ్’ (Premam) తోనే బంపర్ హిట్ కొట్టిన నటి సాయి పల్లవి (Sai Pallavi). ఈ చిత్రంలో మలర్ పాత్రతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది. ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది.

Sai Pallavi: నేను స్టార్‌ను కాదు

మలయాళంలో తొలి సినిమా ‘ప్రేమమ్’ (Premam) తోనే బంపర్ హిట్ కొట్టిన నటి సాయి పల్లవి (Sai Pallavi). ఈ చిత్రంలో మలర్ పాత్రతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది. ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమె స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం సాయి పల్లవికి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనేక హిట్ చిత్రాలు చేసినట్టప్పటికీ తాను స్టార్ అని ఏ మాత్రం అనుకోవడం లేదని సాయి పల్లవి తెలిపింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అనేక ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకుంది.

Sai.jpg

‘‘నేను డ్యాన్స్‌ను ఎప్పుడు నేర్చుకోలేదు. మాదురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, సరోజ్ ఖాన్ వంటి తారల డ్యాన్స్‌ను చూస్తూ నేను పెరిగాను. మొదట చిన్నతనంలో ‘డోలా రే డోలా’ కు స్టెప్స్ వేశాను. అప్పట్లో అది నాకు చాలా నచ్చింది. మీరు నిద్రలో లేపి నన్ను డ్యాన్స్ చేయమన్నా కూడా నేను చేస్తాను. డ్యాన్స్ నా జీవితంలో కీలక పాత్రను పోషిస్తుందని అప్పట్లో నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ వల్లే క్రమశిక్షణ అలవడింది. నా శరీరానికి ఓ రిథమ్ వచ్చింది. నేను సినిమా స్టార్‌ను కాదు. ఓ సాధారణ మనిషిని. నచ్చిన పనిని చేస్తున్నప్పటికి చుట్టు ఉన్న వారి నుంచి ఇంత ప్రేమ లభించడం నాకు దొరికిన అదృష్టం. నా లుక్స్‌ను నేను పట్టించుకోను. ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకు మేకప్ ఏ మాత్రం ఉపయోగపడదని నేను చెప్పడం లేదు. మేకప్ వేసుకుంటే మీరు ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంటే ఆ పనిని చేయవచ్చు. నేను ఈ విధంగా ఉన్నప్పటికి ఆత్మ విశ్వాసంగానే ఉన్నాను’’ అని సాయి పల్లవి తెలిపింది.

సాయి పల్లవి చివరగా ‘విరాట పర్వం’ (Virata Parvam) లో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఆమె మార్కులే పడ్డాయి. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. శివ కార్తికేయన్ (Sivakarthikeyan)తో ఓ సినిమా చేయనున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-03-31T16:16:31+05:30 IST