Salaar: ద్వి పాత్రాభినయం చేస్తున్న ప్రభాస్.. జేమ్స్‌బాండ్ లోకేషన్‌లో షూటింగ్..

ABN , First Publish Date - 2023-03-31T17:11:33+05:30 IST

‘బాహుబలి’ తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) లో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

Salaar: ద్వి పాత్రాభినయం చేస్తున్న ప్రభాస్.. జేమ్స్‌బాండ్ లోకేషన్‌లో షూటింగ్..

‘బాహుబలి’ తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) లో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఇటలీలోని ప్రముఖ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేక అంతర్జాతీయ చిత్రాలు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణను జరుపుకొన్నాయి.

Prabhas.jpg

సలార్ మూవీ షూటింగ్ ఇటలీలోని మాటెరా (Matera) లో జరగుతున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మార్చి అర్ధ భాగం నుంచి అక్కడే చిత్రీకరణ కొనసాగుతున్నట్టు సమాచారం అందుతుంది. గతంలో జేమ్స్ బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’ (No Time to Die) లో ఓ యాక్షన్ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రీకరించారు. మాటెరాలో చిత్రీకరణ ముగిశాక ఇటలీలోని నేపుల్స్ సిటీకి చిత్ర బృందం చేరకుంటుంది. నైట్ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అనంతరం రోమ్, బుడాపెస్ట్ వంటి నగరాల్లో కూడా షూటింగ్ చేయబోతున్నారు.

సలార్ చిత్రీకరణను విదేశాల్లో జరపడానికి బలమైన కారణం ఉందట. రెండు వేర్వేరు దేశాలకు చెందిన ప్రేమికుల నేపథ్యంలో సినిమా కథ కొనసాగనుందని సమాచారం. ఆ ఇబ్బందులను ఈ ప్రేమికులు ఏ విధంగా అధిగమించారనేదే చిత్ర కథాంశం. ‘సలార్’ లో థ్రిల్లర్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ మూవీలో ద్వి పాత్రాభినయం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-03-31T17:16:48+05:30 IST