Mega Power: ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ వదిలిన మెగా డైరెక్టర్స్

ABN , First Publish Date - 2023-03-27T23:06:17+05:30 IST

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ఇటీవల ప్రారంభమైన చిత్రం ‘మెగా పవర్‌’ (Mega Power). ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌

Mega Power: ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ వదిలిన మెగా డైరెక్టర్స్
Mega Power First Look Launch

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ఇటీవల ప్రారంభమైన చిత్రం ‘మెగా పవర్‌’ (Mega Power). ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని జరిగిన వేడుకలలో మెగా దర్శకులు మెహర్‌ రమేష్‌ (Meher Ramesh), కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) (KS Ravindra) విడుదల చేశారు. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర (Gedela RaviChandra) దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు (Ram Charan Birthday) సందర్భంగా చిరంజీవిగారి (Chiranjeevi) మీద ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశాం. మేం అడగ్గానే బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మెహర్‌ రమేశ్‌, బాబీ మా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చరణ్‌ పుట్టినరోజున మా సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాం. ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన మా చిత్రం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మెగా హీరోల అభిమానులు అందరి సపోర్ట్‌ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. (Mega Power Movie)

Chiru.jpg

ఇక ఈ ఫస్ట్ లుక్ మెగాభిమానులు బాగా ఆకర్షిస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘ముఠామేస్త్రి’ చిత్రంలోని కటౌట్.. ఆ కటౌట్‌లో మెగాస్టార్ పవర్ ఫుల్ లుక్ ఈ పోస్టర్‌ను ఆసక్తికరంగా మలిచాయి. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ముదినేపల్లి పూర్ణిమా థియేటర్ కనిపిస్తోంది. థియేటర్ ఎదురుగా స్కూల్‌కి వెళుతున్న పిల్లలు, కొందరు పెద్ద మనుషులతో పాటు.. చంటి బిడ్డతో ఓ తల్లి నడుచుకుంటూ వెళుతున్నారు. పైన టైటిల్‌లో ‘నో కాప్షన్’ అని చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల ఇమేజ్ ఉంది. మొత్తంగా ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. (Mega Power Movie First Look)

ఇవి కూడా చదవండి:

*********************************

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T23:09:47+05:30 IST