సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Meter Trailer: నీ మీటర్ సెట్టైనట్లే పో.. కిరణ్ అబ్బవరం అదరగొట్టాడు..

ABN, First Publish Date - 2023-03-29T14:24:45+05:30

ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు పొందిన యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).

Meter trailer out
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు పొందిన యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). హిట్టు, ఫ్లాపు అనే వాటితో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చేస్తూ.. కెరీర్ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘వినరో భాగ్యమూ విష్ణు కథ’ అనే చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలై అక్కడ సైతం మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా కిరణ్ ‘మీటర్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ కాడూరి (Ramesh Kaduri) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers), క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యువ నటి అతుల్య రవి హీరోయిన్‌‌గా నటించింది. ఈ చిత్రంలో మొదటిసారి కిరణ్ పోలీసుపాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుండడంతో.. మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌‌ని జోరుగా చేస్తోంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ వరుస యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తిగా ఉంది. అలాగే.. యాక్షన్‌తో పాటు కామెడీ, లవ్, రొమాన్స్‌తో ఫుల్ మీల్స్ పెట్టేందుకు కిరణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని పలు డైలాగులు సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. (meter trailer out now)

‘ఏయ్యడం నాకు కొత్తేంకాదు.. నీ ముందేయ్యడం కొత్త’.. ‘వాడు బాల్‌లాంటోడు.. ఎన్నిసార్లు కొట్టినా పైకి లేస్తూనే ఉంటాడు. వాడి గాలి తీసేయాండ్రా’.. ‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’.. ‘నీ మీటర్ సెట్టైనట్టే పో’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. కిరణ్‌లోని మాస్ హీరోని బయటపెట్టేలా ఉన్నాయి. ఓ వైపు వరుస హిట్ సినిమాలు తీస్తున్న నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాకి సమర్పకులుగా ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కిరణ్ కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా.. ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కిరణ్ అబ్బవరం ఈ చిత్రంతో మాస్ ఇమేజీ వస్తుందని భారీ ఆశలే పెట్టుకున్నాడు. (Kiran Abbavaram meter movie trailer released)

ఇవి కూడా చదవండి:

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..


Updated Date - 2023-03-29T14:28:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!