scorecardresearch

NTR 30: పట్టాలెక్కేది ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-03-30T18:38:50+05:30 IST

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు.

NTR 30: పట్టాలెక్కేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, నందమూరి తారక రామరావు ఆర్ట్స్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకొంది. అతి త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

Janhvi-Kapoor.jpg

‘ఎన్‌టీఆర్ 30’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సముద్ర తీర ప్రాంతాల నేపథ్యంగా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ మార్చి 31నుంచి ప్రారంభం కానుందని సమాచారం అందుతుంది. ఈ మూవీ కోసం మేకర్స్ భారీస్థాయిలో సెట్స్ వేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయాన్ని వెచ్చించనున్నారని తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ కోసం హాలీవుడ్ ప్రముఖులు పనిచేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండటంతో భారీ ఎత్తున పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ (Kenny Bates) ఈ ఫైట్స్‌ను కంపోజ్ చేయనున్నారు.

‘ఎన్‌టీఆర్ 30’ లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ పాత్రను పోషించనున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు మేకర్స్ చెప్పారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా యుగంధర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-30T18:39:26+05:30 IST