Janatha Bar: రాయ్‌లక్ష్మీ బార్‌‌కు ‘సర్కారు వారి పాట’ దర్శకుడి సపోర్ట్

ABN , First Publish Date - 2023-03-22T19:04:05+05:30 IST

రాయ్‌లక్ష్మీ (Raai Laxmi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’ (Janatha Bar). రమణ మొగిలి (Ramana Mogili) దర్శకుడు. అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్

Janatha Bar: రాయ్‌లక్ష్మీ బార్‌‌కు ‘సర్కారు వారి పాట’ దర్శకుడి సపోర్ట్
Raai Laxmi in Janatha Bar

రాయ్‌లక్ష్మీ (Raai Laxmi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’ (Janatha Bar). రమణ మొగిలి (Ramana Mogili) దర్శకుడు. అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ (Rochisri Movies) సంస్థ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం (Tirupathi Reddy Beeram) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) దర్శకుడు పరశురామ్ సపోర్ట్ అందించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను ఉగాది స్పెషల్‌గా ఆయన విడుదల చేశారు.

విడుదల అనంతరం దర్శకుడు పరశురామ్ (Parasuram) మాట్లాడుతూ.. కమర్షియల్ విలువలతో పాటు ఓ బర్నింగ్ ఇష్యూను డీల్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. టైటిల్ కూడా క్యాచీగా వుంది. దర్శకుడు రమణ మొగిలికి ఈ చిత్రం మంచి పేరును తీసుకురావాలి. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

Parasuram.jpg

దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ.. రాయ్‌లక్ష్మీ (Heroine Raai Laxmi) కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర.. ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. స్పోర్ట్స్‌ను (Sports) కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి చక్కని సందేశాన్ని (Message) జోడించి రూపొందించిన చిత్రమిది. దర్శకుడు పరశురామ్‌గారి చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ (Shakti Kapoor) ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి (Tollywood) అడుగుపెడుతున్నాడు. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

*Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-22T19:08:11+05:30 IST