#BoycottRohiniCinemas: సడెన్‌గా ఈ ట్యాగ్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-03-30T16:28:49+05:30 IST

కోలీవుడ్ స్టార్ శింబు (Simbu) హీరోగా నటించిన సినిమా ‘పతు తలా’ (Pathu Thala). గౌతమ్ కార్తిక్ (Gautham Karthik) కీలక పాత్ర పోషించారు. ఎన్. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదలైంది.

#BoycottRohiniCinemas: సడెన్‌గా ఈ ట్యాగ్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

కోలీవుడ్ స్టార్ శింబు (Simbu) హీరోగా నటించిన సినిమా ‘పతు తలా’ (Pathu Thala). గౌతమ్ కార్తిక్ (Gautham Karthik) కీలక పాత్ర పోషించారు. ఎన్. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే, ఈ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ వివాదంలో చిక్కుకొంది.

తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో ‘పతు తలా’ ను ప్రదర్శిస్తున్నారు. సంచారజాతికి చెందిన ఓ కుటుంబం ఆ సినిమాను చూడాలని టిక్కెట్స్‌ను కొనుగోలు చేసింది. షో టైమ్‌కు థియేటర్‌కు వెళ్లింది. టిక్కెట్స్ ఉన్నప్పటికీ థియేటర్ యజమాన్యం మాత్రం వారిని లోపలికి అనుమంతిచలేదు. ఫలితంగా నెటిజన్స్ థియేటర్ యజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. రోహిణి సినిమాస్‌ను బాయ్‌కాట్ (BoycottRohiniCinemas) చేయాలని పోస్ట్‌లు పెడుతున్నారు. టిక్కెట్స్ ఉన్నప్పటికీ షోకు ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రోహిణి సినిమాస్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Simbu.jpg

‘‘పతు తలా సినిమాను ప్రదర్శనకు ముందు మా థియేటర్‌లోని చోటు చేసుకున్న ఘటనను మేం గమనిస్తున్నాం. సినిమాను చూడటానికి కొంత మంది వారి పిల్లలతో టిక్కెట్‌ను కొని థియేటర్‌కు వచ్చారు. ఈ మూవీకి సెన్సార్ అధికారులు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. యు/ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలను వీక్షించడానికి 12 ఏళ్ల లోపు వారికి చట్టప్రకారం అనుమతి లేదు. ఆ కుటుంబం 2, 6, 8, 10 ఏళ్ల లోపు వారితో చిత్రాన్ని చూడటానికి వచ్చింది. అందువల్ల టిక్కెట్‌ను చెక్ చేసే సిబ్బంది వారిని మూవీని వీక్షించడానికి నిరాకరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రేక్షకులు అక్కడ ఏం జరిగిందో తెలిసుకోకుండా పరిస్థితిని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. శాంతి, భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలని అదే కుటుంబాన్ని షో సమయానికి సినిమాను చూసేందుకు అనుమతించాం. అందుకు సంబంధించిన వీడియోను కూడా అటాచ్ చేస్తున్నాం’’ అని థియేటర్ యజమాన్యం ప్రకటనను జారీ చేసింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-30T16:33:29+05:30 IST