Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది

ABN , First Publish Date - 2023-07-20T11:58:37+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే ట్రెండ్ సెట్టర్‌గా రికార్డులు క్రియేట్ చేస్తూ.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళుతోన్న సితార పుట్టినరోజు నేడు (జూలై 20). ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది
Sitara Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni).. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే ట్రెండ్ సెట్టర్‌గా రికార్డులు క్రియేట్ చేస్తూ.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళుతోన్న సితార పుట్టినరోజు నేడు (జూలై 20). కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే సితార.. తండ్రికి తగ్గ తనయగా పేరు, తన మార్క్ ఐడెంటిటీని సంపాదించుకుంది.. సంపాదించుకుంటోంది. చిన్న వయసు నుంచే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సితార (Sitara).. ఇవాళ ఒక గోల్డ్ బ్రాండ్‌కి.. అదీ కూడా 11 ఏళ్ల వయసులో బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador)గా వ్యవహరిస్తుందంటే.. ఈ అపరంజి బొమ్మ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.


Sitara-1.jpg

ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న గోల్డ్ బ్రాండ్.. సితారపై తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌ని కూడా రూపొందించింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో సితారని చూసిన వారంతా ‘ఏంజెల్’ (Angel) అంటూ కితాబిస్తున్నారంటే.. మున్ముందు ఆమె సృష్టించబోయే హిస్టరీ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన సితార ఫొటోలని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద ప్రదర్శించి.. ఘట్టమనేని అభిమానులనే కాకుండా.. తెలుగు సినిమా అభిమానులందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ యాడ్‌కి సంబంధించి విడుదల చేసిన ‘ప్రిన్సెస్’ (Princess) అనే షార్ట్ ఫిల్మ్‌లో అయితే సితార నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఇంత టాలెంట్ ఉందా? సితారలో అని ఆశ్చర్యపోతున్నారు.

Sitara-3.jpg

ఒకవైపు స్టడీస్ పరంగా దృష్టి సారిస్తూనే.. మరో వైపు తనకిష్టమైన నటన, నాట్యం, డ్యాన్స్ సంబంధించిన వాటిలో ప్రాక్టీస్‌ తీసుకుంటోంది సితార. రీసెంట్‌గా ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలు ఏ విధంగా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఇక ఆమెలో ఉన్న మరో కోణం, మహేష్ బాబు నుంచి వారసత్వంగా సంక్రమించిన మరో గొప్ప లక్షణం ఛారిటీ. తన మొదటి రెమ్యునరేషన్ ఓ ఛారిటీకి వినియోగించినట్లుగా రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో సితారనే తెలిపింది. గతంలో కూడా తన పాకెట్ మనీని పలు మార్లు మహేష్ బాబు ఫౌండేషన్‌ (Mahesh Babu Foundation)కి ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఇలా మల్టీ టాలెంట్‌తో తన కంటూ సొంత గుర్తింపు‌ని తెచ్చుకుంటూ.. తన పరిధిని పెంచుకుంటున్న సితూ పాపని చూసి తల్లిదండ్రులైన సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) గర్వపడుతున్నట్లుగా అనేక సందర్భాల్లో చెప్పారు.


Sitara-2.jpg

ఇక ఘట్టమనేని ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది. వారి ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. త్వరలోనే ఆమె సినీ అరంగేట్రం చేయబోతుందంటూ రీసెంట్‌గా నమ్రత క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో.. ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే అందరి నోటా కీర్తింపబడుతున్న.. సితార (#SitaraGhattamaneni) పాప.. ఎంట్రీతో హిస్టరీ క్రియేట్ చేయడం పక్కా అనేలా ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇక ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ చెప్పే శుభాకాంక్షలతో సితార ఘట్టమనేని పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (#HBDSitaraGhattamaneni)


ఇవి కూడా చదవండి:

**************************************

*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

**************************************

*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!

**************************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు

**************************************

*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

Updated Date - 2023-07-20T11:58:37+05:30 IST