Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

ABN , First Publish Date - 2023-07-19T15:49:16+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K). ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..
Prabhas Look From Project K

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K). ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో ప్రభాస్‌ని చూసిన వారంతా.. ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి అవతార్‌లో ఇంత వరకు టాలీవుడ్ హీరోస్ కనబడింది లేదు. దాదాపు ఐరన్ మ్యాన్ ‌లుక్‌ని పోలివున్న ప్రభాస్‌ని చూడగానే.. ఇది అలాంటిలాంటి సినిమా అయితే కాదనే క్లారిటీ అయితే జనాలకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.


అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారంతా ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas)తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుండటం విశేషం. ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ భారత్‌లో జూలై 21న, అమెరికాలో జూలై 20న విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేయబోతోంది. ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. (Prabhas Look in Project K Out)

Prabhas.jpg

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్‌గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

Updated Date - 2023-07-19T15:55:02+05:30 IST