Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

ABN , First Publish Date - 2023-07-19T17:09:35+05:30 IST

మీనాక్షి చౌదరి.. మోడలింగ్‌లో రాణిస్తూ వచ్చిన ఈమె 2018లో ‘మిస్‌ ఇండియా’ విజేత‌గా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’ వంటి చిత్రాల్లో నటించింది. ఇపుడు విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కిన ‘కొలై’ (‘హత్య’) సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డే తప్పుకోవడంతో.. ఆ పాత్ర తనకు వచ్చిందని తాజాగా ఆమె తెలిపింది.

Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది
Meenakshi Chaudhary

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).. హరియాణా రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ దంత వైద్యురాలు. మోడలింగ్‌లో రాణిస్తూ వచ్చిన ఈమె 2018లో ‘మిస్‌ ఇండియా’ విజేత‌గా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’ వంటి చిత్రాల్లో నటించింది. ఇపుడు విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కిన ‘కొలై’ (తెలుగులో ‘హత్య’) సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీనాక్షి చౌదరి కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా చేస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందో తాజాగా మీనాక్షి రివీల్ చేసింది.


‘‘నా పాత్రకు తొలుత పూజా హెగ్డే (Pooja Hegde)ను ఎంపిక చేశారు. ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వరించింది. ‘గుంటూరు కారం’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఈ సినిమా ఫస్ట్ డే షూట్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. అలాంటిది ఫ‌స్ట్‌డే, ఫ‌స్ట్ షాట్‌లోనే ఆయనతో క‌లిసి న‌టించ‌డం నిజంగా ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అనుభూతి’’ అని తెలిపింది.

Meenakshi.jpg

ఇంకా ఆమె మాట్లాడుతూ.. దంత వైద్య కోర్సును పూర్తి చేశాను. కానీ, ఒక్క ఆస్పత్రిలో కూడా పనిచేయలేదు. మోడలింగ్‌, సినిమా రంగాల్లో బిజీగా మారిపోయా. నయనతార (Nayanthara), త్రిష (Trisha) నటన నాకు ఎంతో ఇష్టం. తమిళ్‌లో నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘కొలై’ (తెలుగులో ‘హత్య’). తమిళంలో పెద్ద హీరోలందరితో నటించాలన్నదే నా కోరిక. ‘హత్య’ సినిమాలో లైలా (Laila) పాత్రలో కనిపిస్తాను. ఈ క్యారెక్టర్‌లో నటిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి లైలాగా మారాను. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

Updated Date - 2023-07-19T17:09:35+05:30 IST