Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!

ABN , First Publish Date - 2023-07-19T21:28:33+05:30 IST

స్టార్ హీరోల సినిమాలు అందునా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద ఉండే సందడే వేరు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విషయంలో ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేసేలా ఆ చిత్ర నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు స్పెషల్ షో, టికెట్ హైక్స్ ఉండవని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!
Bro Movie Producer TG Viswa Prasad

స్టార్ హీరోల సినిమాలు అందునా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద ఉండే సందడే వేరు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విషయంలో ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేసేలా ఆ చిత్ర నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ నటుడు, దర్శకుడైన సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా బడ్జెట్, టికెట్ల రేట్ల గురించి ఆయన చెప్పిన సమాధానం విని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.


‘బ్రో’ సినిమా బడ్జెట్ పరిమితి దాటిందా? టికెట్ రేట్లు పెంచే ఆలోచన ఏమైనా ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మేము అనుకున్న బడ్జెట్‌లో‌నే సినిమాని పూర్తి చేయగలిగాము. బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాము. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరలేదు. ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలని అనుకుంటున్నాం..’’ అని తెలిపారు. అలాగే ప్రీమియర్ షో‌ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అయితే ఆ ఆలోచన లేదు. చిన్న సినిమాలకు తమ కంటెంట్‌ని చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. (Bro Movie Producer TG Vishwa Prasad)

Power-star.jpg

అయితే నిర్మాత తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ కొందరు నిరాశ పడుతుంటే.. మరికొందరు మాత్రం మంచి నిర్ణయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు పడుతున్నాయి. టికెట్ల ధరలు ఇప్పుడున్నట్లుగా ఉంటేనే జనం థియేటర్లకి ఎక్కువగా వస్తారు. సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఒకవేళ టికెట్ల ధరలు పెంచాలన్నా.. తెలంగాణ వరకు ఓకే గానీ.. ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు వారివ్వరు.. అవసరమా? అంటూ కొందరు అంటుంటే.., ఇలా అయితే ఫస్ట్ డే రికార్డ్ ఎలా కొట్టేది? అంటూ నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వినిపిస్తున్న సమాచారం అయితే.. ఈ సినిమాకు ఇప్పటికే బిజినెస్ బాగా జరిగిందని.. అందుకే నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేలా టాక్ వినబడుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు

**************************************

*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

Updated Date - 2023-07-19T21:28:33+05:30 IST