Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు

ABN , First Publish Date - 2023-07-19T18:43:50+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇద్దరూ ఎంత గొప్ప స్నేహితులో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. వారిద్దరే కాదు.. వారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఉపాసన, లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహ బంధం కొనసాగుతోందనే విషయం తెలిసిందే. రీసెంట్‌గా చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన బిడ్డ ‘క్లీంకార’ కు తారక్ ఆశ్చర్యపరిచే గిఫ్ట్‌ని పంపినట్లుగా తెలుస్తోంది.

Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు
Ram Charan and Jr NTR Families

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. ఇద్దరూ ఎంత గొప్ప స్నేహితులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రమోషన్స్‌లో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్‌డే అంటే చాలు.. అర్థరాత్రి ఇద్దరం బయటికి చెక్కేస్తామని చరణ్, ఎన్టీఆర్.. వారి మధ్య ఉన్న స్నేహం గురించి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరింతగా బలపడిందనేది కాదనలేని వాస్తవం. వారిద్దరే కాదు.. వారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఉపాసన, లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహ బంధం కొనసాగుతోందనేది అప్పుడప్పుడు వారు షేర్ చేసే ఫొటోలే చెబుతుంటాయి. ఇక రీసెంట్‌గా ఉపాసన, చరణ్ దంపతులకు మెగా ప్రిన్సెస్ జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకి యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ఓ గిఫ్ట్ పంపించినట్లుగా ఇప్పుడో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.


తన సోపతి (Friend) బిడ్డకి ఈ కొమరం భీమ్ (Komaram Bheem) పంపిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే అంతా ఆశ్చర్యపోవడం ఖాయం. అసలెవరూ ఊహించి కూడా ఉండరు. అలాంటి గిఫ్ట్‌ని తారక్ అండ్ ఫ్యామిలీ ప్లాన్ చేశారు. మెగా ప్రిన్సెస్‌ (Mega Princess)కు ఇటీవల ‘క్లీంకార’ (Klin Kaara) అని నామకరణం చేస్తూ.. ఓ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడా క్లీంకారకు, చరణ్ ఉపాసన దంపతులకు గోల్డ్ డాలర్స్‌ను బహుమతిగా పంపాడట యంగ్ టైగర్. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఆ గోల్డ్ డాలర్స్‌పై క్లీంకార, రామ్ చరణ్, ఉపాసన పేర్లు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ (Gold Dollar Design) చేయించాడట తారక్. ఈ గిఫ్ట్ చూసిన చరణ్ అండ్ ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఫీలయ్యారనేలా టాక్ వినబడుతోంది.

Charan-NTR.jpg

ఈ విషయం తెలిసి.. మరోసారి మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చరణ్, తారక్‌ల స్నేహం సంగతి ఇలా ఉంటే.. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సీక్వెల్ (RRR2) కూడా ఉంటుందనేలా.. ఆ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల కామెంట్స్‌ చేశారు. ఆ సీక్వెల్‌కు మాత్రం హీరోలు వాళ్లే ఉంటారు కానీ.. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించకపోవచ్చనేలా ఆయన చేసిన కామెంట్స్‌పై ఇంకా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మరో వైపు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

Updated Date - 2023-07-19T18:43:50+05:30 IST