Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

ABN , First Publish Date - 2023-07-18T18:44:48+05:30 IST

‘బేబీ’ సినిమా కథని ఒక హీరోకు చెబుదామనుకుంటే.. అతను డైరెక్టర్ అయితే కథ కూడా వినను అన్నాడని.. తాజాగా దర్శకుడు సాయి రాజేష్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇండస్ట్రీలో దర్శకులకు ఇలాంటి అవమానాలు కామనే కానీ.. ఇప్పుడా సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుండటంలో.. మంచి సినిమాను మిస్సయిన ఆ హీరో ఎవరా అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు.

Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?
Director Sai Rajesh

‘బేబీ’ సినిమా కథని ఒక హీరోకు చెబుదామనుకుంటే.. అతను డైరెక్టర్ అయితే కథ కూడా వినను అన్నాడని.. తాజాగా దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇండస్ట్రీలో దర్శకులకు ఇలాంటి అవమానాలు కామనే కానీ.. ఇప్పుడా సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుండటంలో.. మంచి సినిమాను మిస్సయిన ఆ హీరో ఎవరా అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్‌గా ‘బేబీ’ (Baby) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిపారు. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్‌ (Viraj Ashwin)ల నటనకు.. నిర్మాతగా ఎస్‌కేఎన్ (SKN) అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై.. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ వేడుకలో సాయి రాజేష్.. ఈ సినిమా విషయంలో తననొక హీరో అవమానించిన విషయాన్ని బయటపెట్టారు.


దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ (Sai Rajesh About Baby).. ‘‘ఆనంద్‌కు కథ చెప్పడానికి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది విజయ్‌గారే. ఆనంద్ తప్ప మరో హీరోను నా సినిమాకు ఊహించుకోలేదు. అతను ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి రావడానికి, నేను చెప్పినట్లు నటించడానికి హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేశాడు. ఆనంద్ నాకు ఇచ్చిన అవకాశం ఈ సినిమా. వైష్ణవి మంచి జాబ్ చేస్తూ అవన్నీ వదులుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడి మరీ ఈ సినిమా చేసింది. విరాజ్ ఏమాత్రం ఈగో లేకుండా ఈ సినిమా చేశాడు. ఎవరికి పేరొస్తుందని ఆలోచించలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మాడు.

Allu-Aravind.jpg

ఒక హీరోకు ఈ కథ చెబుదామనుకుంటే.. ఆ డైరెక్టర్ అయితే కథ కూడా వినను అన్నాడు. అలాంటి టైమ్‌లో ఈ ముగ్గురు నన్ను ఓ మంచి సినిమాకు దర్శకుడిని చేశారు. ఎస్.కె.ఎన్ నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం. నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. డైరెక్టర్ మారుతి‌గారికి మా అందరి కంటే ఎక్కువగా సినిమా మీద నమ్మకం ఉండేది. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్‌లోనూ చేస్తానని మాటిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇంత మంచి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరై ఉంటారబ్బా? అంటూ సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ దర్శనమిస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

Updated Date - 2023-07-18T18:44:48+05:30 IST