Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

ABN , First Publish Date - 2023-07-19T22:41:30+05:30 IST

రీసెంట్‌గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రాలను ఆ సంస్థే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ఇప్పుడా సంస్థ బాటలోనే టాలీవుడ్‌కి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అడుగులేస్తోంది. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతోన్న ‘లియో’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా సితార పేర్కొంది.

Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!
Sithara Entertainments Producer Vamsi

రీసెంట్‌గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూషన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రాలను ఆ సంస్థే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ఇప్పుడా సంస్థ బాటలోనే టాలీవుడ్‌కి చెందిన మరో ప్రముఖ సంస్థ డిస్ట్రిబ్యూషన్ బాట పడుతోంది. అవును.. ఇప్పటి వరకు కంటెంట్ ప్రధాన చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ నిర్మాణ సంస్థగా పేరుపొందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సంస్థ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ (Distribution) రంగంలోకి దిగుతోంది.


ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిద్యభరిత, ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. వారు పాన్ ఇండియా స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇతర భాషలకు చెందిన వివిధ అగ్ర నటులతో కూడా చేతులు కలుపుతున్నారు. ఇటీవల ధనుష్‌తో ‘సార్’(వాతి)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దళపతి విజయ్ (Vijay) మరియు సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో రూపొందుతోన్న భారీ అంచనాలు కలిగిన చిత్రం ‘లియో’ (Leo Movie)లో భాగస్వాములు కాబోతున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవలే చిత్ర బృందం షూటింగ్‌ను పూర్తి చేసింది. దాదాపు 125 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో ప్రధానంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్ మాస్టర్స్‌ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది. ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 అక్టోబర్ 19న విడుదలకాబోతోంది. లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!

**************************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు

**************************************

*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

*Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

**************************************

Updated Date - 2023-07-19T22:41:30+05:30 IST