సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Lakshmi: ఐక్యం.. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్

ABN, First Publish Date - 2023-05-18T19:21:29+05:30

చిన్న వయసులోనే ప్రాచీన ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే థాట్ రావడం చాలా గ్రేట్ అని అన్నారు నటి మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ‘ఐక్యం’ (Aikyam) పేరుతో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ (Devender Goud) మనవరాలు

Mayuka Aikyam Dance Video Launch
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న వయసులోనే ప్రాచీన ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే థాట్ రావడం చాలా గ్రేట్ అని అన్నారు నటి మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ‘ఐక్యం’ (Aikyam) పేరుతో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ (Devender Goud) మనవరాలు మయూక (Mayukha) నర్తించిన కూచిపూడి నృత్యపు వీడియోను తాజాగా హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ శీరత్ కపూర్, నిర్మాత స్వప్నాదత్‌లతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా ప్రాచీన ఆలయాలను వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ థాట్ వచ్చిన మయూకను ఆమె అభినందించారు.

మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ మనవరాలు మయూక (Mayuka) మాట్లాడుతూ.. ప్రాచీన ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు అయిగిరి నందిని పాట మీద కూచిపూడి ప్రదర్శనతో వీడియో చేశాం. చిన్నప్పటి నుంచి క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ఎంతో ఇష్టంతో ఈ వీడియోని చేశాము. తెలంగాణలో (Telangana) ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. వాటిన్నింటిని భరతనాట్యం, కూచిపూడి వంటి కళలతో అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ‘ఐక్యం’ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), శీరత్ కపూర్ (Seerat Kapoor), స్వప్నాదత్ (Swapna Dutt) వంటి వారంతా మాట్లాడుతూ.. మయూక ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి విజయేందర్‌గౌడ్, శ్వేత, వీరేందర్, వినయేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

Updated Date - 2023-05-18T19:21:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!