Orange Special Shows: ఈ ఊపు చూస్తుంటే.. చరణ్ సినిమాలన్నీ రీ రిలీజ్ చేస్తారేమో?

ABN , First Publish Date - 2023-03-25T19:08:45+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన నటించిన ‘ఆరెంజ్’ (Orange) చిత్రాన్ని రెండు రోజుల పాటు స్పెషల్ షోస్ వేస్తున్న..

Orange Special Shows: ఈ ఊపు చూస్తుంటే.. చరణ్ సినిమాలన్నీ రీ రిలీజ్ చేస్తారేమో?
Orange Movie Stills

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన నటించిన ‘ఆరెంజ్’ (Orange) చిత్రాన్ని రెండు రోజుల పాటు స్పెషల్ షోస్ వేస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా నాగబాబు (Nagababu) ఈ విషయాన్ని వెల్లడించారు. మార్చి 25, 26న ఈ స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఈ స్పెషల్ షోస్‌కు అనూహ్య రెస్పాన్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అనౌన్స్ చేసిన ప్రతి థియేటర్‌లో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని అమ్ముడైనట్లుగా చెబుతూ.. నాగబాబు అండ్ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా అయితే మాములుగా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ హంగామాలో రామ్ చరణ్ ఏ రేంజ్‌లో హైలెట్ అయ్యాడో తెలియంది కాదు. ప్రతి స్టేజ్‌పై అమెరికా ఆడియన్స్ ఆయనకు నీరాజనాలు పలికారు. అలాంటి క్రేజ్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) మూవీ తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుండటంతో.. ఫ్యాన్స్ థియేటర్లలో ఊగిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘జల్సా’ (Jalsa) రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎలా అయితే డ్యాన్సులు చేశారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోంది.

మెగా ఫ్యాన్స్ (Mega Fans) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోలు అలా ఉన్నాయి మరి. పాటలు వస్తుంటే.. ప్రతి ఒక్కరూ లేచి డ్యాన్సులు చేస్తున్నారు. ఈ స్పెషల్ షోలకి వస్తున్న రెస్పాన్స్ చూసి.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్పందన చూసి రామ్ చరణ్ నటించిన సినిమాలన్నింటినీ రీ రిలీజ్ చేస్తారేమో.. అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ‘ఆరెంజ్’ కంటే ముందు ‘మగధీర’ (Magadheera) చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అధికారికంగా గీతా ఆర్ట్స్ (Geetha Arts) నుంచి ప్రకటన కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో.. మరోసారి ‘మగధీర’ అని చెబుతూ ‘ఆరెంజ్’కు లైన్ క్లియర్ చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ‘ఆరెంజ్’ సినిమా స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ‘జనసేన’ (Janasena) పార్టీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుందని నాగబాబు తెలియజేశారు. దీంతో గీతా ఆర్ట్స్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఇంతకీ నాగబాబు ఏం చెప్పారంటే..

Ram-Charan.jpg

‘‘తెలుగువారి ఖ్యాతి ప్రపంచ నలుదిశలా చాటి చెప్పి, ఆస్కార్ వరకు పయనించిన RRR చిత్ర కథానాయకుడు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) జన్మదినం సందర్భంగా.. మార్చి 25, 26న తను నటించిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’ని విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి మన జనసేన పార్టీకి (Janasena Party) విరాళం ఇవ్వాలని నిర్ణయించాం.

మెగా అభిమానులు, జన సైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగమై, వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాను’’ అని నాగబాబు మెగా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-26T00:54:31+05:30 IST