Ravi Teja: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..

ABN , First Publish Date - 2023-05-24T17:11:40+05:30 IST

దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్ జోన్’. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు.. అంటూ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కు ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు వాయిస్ ఓవర్ అందించారు. ఈ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Ravi Teja: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..
Tiger Nageswara Rao First Look

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా వంశీ (Vamsee) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ‘ద కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ (Abhishek Agarwal Arts) నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని (Tiger Nageswara Rao First Look Glimpse) మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌కి సంబంధించిన విశేషం ఏమిటంటే.. ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు.. వాయిస్ ఓవర్ ఇవ్వడం. తెలుగు వెర్షన్‌కి సంబంధించిన పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్‌ (Victory Venkatesh) విడుదల చేయగా.. జాన్‌ అబ్రహం, శివ రాజ్‌కుమార్‌, కార్తీ, దుల్కర్‌ సల్మాన్‌లు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. వారి పవర్ ఫుల్ వాయిస్‌తో వచ్చిన ఈ గ్లింప్స్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

గ్లింప్స్ విషయానికి వస్తే.. ‘‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా.. అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడ మంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే.. గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే.. జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్ జోన్’. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు..’’ అని వెంకీ వాయిస్‌లో టైగర్ నాగేశ్వరరావు హిస్టరీని పరిచయం చేయగా.. ‘జింకల్ని వేటాడే పులిని చూసుంటావ్.. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా?’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఎంత పవర్ ఫుల్‌గా ఉందో.. ఆ తర్వాత వచ్చే లుక్ కూడా టైగర్‌ని పోలిన ఆకారంలో అంతే బీభత్సంగా ఉంది. ఓవరాల్‌గా అయితే.. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే.. సినిమా రేంజ్ ఏంటనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. (Tiger Nageswara Rao First Look Glimpse)

Tiger-Update.jpg

రవితేజ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా మాస్, రగ్డ్ లుక్‌లో ఈ సినిమా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఫెరోషియస్‌గా ఉంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని సైతం పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!

*Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

*Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

Updated Date - 2023-05-24T18:46:02+05:30 IST