Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

ABN , First Publish Date - 2023-05-23T18:28:00+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా.. ప్రస్తుతం తను చేస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను లీక్ చేశారు. ‘చిరు లీక్స్’ అంటూ ఆయన స్వయంగా ఈ ఫొటోలను లీక్ చేయడంతో పాటు.. మరి కొన్ని త్వరలో అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?
Bholaa Shankar Song Shoot Location

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఏది దాచుకోలేరు. ఆఖరికి తన సినిమా టైటిల్స్ కూడా. ఆ మధ్య వేరే సినిమా ఫంక్షన్‌కి వెళ్లి.. ‘ఆచార్య’ (Acharya) టైటిల్ లీక్ చేశారు. ఆ తర్వాత ‘గాడ్‌ ఫాదర్’ (God Father) సంబంధించి కొన్ని అప్‌డేట్స్ ఆయన ముందే రివీల్ చేశారు. రీసెంట్‌గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఆయన ముందే లీక్ చేశారు. ఇలా ఆయన ఏదైనా ఫంక్షన్ లేదంటే ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు.. ఆయనకు తెలియకుండానే కొన్ని లీక్ చేసేస్తుండటంతో.. ఇక లాభం లేదనుకుని.. ఆయన ‘చిరు లీక్స్’ (Chiru Leaks) అంటూ.. ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి కొన్ని లీక్స్ చేసేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాకు సంబంధించి ‘చిరు లీక్స్’ అంటూ కొన్ని ఫొటోలను ట్విట్టర్ వేదికగా లీక్ చేశారు.

మెగాస్టార్ తన ట్విట్టర్‌లో.. ‘‘స్విట్జర్లాండ్‌లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్‌లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్..’’ అంటూ లొకేషన్‌లో ఉన్న కొన్ని ఫొటోలను చిరు తన ట్వీట్‌కు జత చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Chiranjeevi Tweet on Bholaa Shankar Movie)

Mega.jpg

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ‌బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) ఆయనకు చెల్లెలిగా నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ (Sushanth) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

Updated Date - 2023-05-23T18:28:07+05:30 IST