Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!

ABN , First Publish Date - 2023-05-24T14:53:11+05:30 IST

‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. రానా, తేజ కాంబినేషన్‌లో ఈసారి తెరకెక్కబోయే చిత్రాన్ని గతంలో భారీ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత గోపినాథ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!
Rana Daggubati and Director Teja

రానా దగ్గుబాటి (Rana Daggubati), సంచలన దర్శకుడు తేజ (Director Teja) కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Matri) చిత్రం ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. హీరోగా రానా దగ్గుబాటి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఆ సినిమా నిలిచింది. అందులో జోగేంద్ర పాత్రలో రానా నటన అందరినీ మెప్పించింది. అలాగే ఆయన భార్యగా చేసిన కాజల్ అగర్వాల్ పాత్ర కూడా సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మరోసారి హీరో రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా చేసిన జోగేంద్ర (Jogendra) పాత్రను మించి.. మరింత బలంగా ఈ సినిమాలో రానా పాత్ర ఉండబోతోందని మేకర్స్ అంటున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తేజ తీర్చిదిద్దబోతున్నారట. మరి ఇందులో రానా జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఓ మలయాళ స్టార్ హీరో (Malayalam Star Hero) మాత్రం ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

Rana-Daggubati.jpg

ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ‘టాప్ హీరో’ (Top Hero), ‘దేవుడు’ (Devudu).. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట (Gopinath Achanta).. విశ్వశాంతి పిక్చర్స్ (Viswasanti Pictures) బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను త్వరలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

*Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

Updated Date - 2023-05-24T14:56:21+05:30 IST