Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

ABN , First Publish Date - 2023-05-24T14:01:26+05:30 IST

టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో తనతో డేట్ చేయాలని వేధించినట్లుగా హన్సిక చెప్పిందంటూ ఓ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. హన్సిక తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఆ వార్తలలో నిజం లేదని తెలుపుతూ.. అలాంటి వార్తలు ముద్రించే వారిపై హన్సిక సీరియస్ అయింది. ఇదొక చెత్త వార్తగా ఆమె పేర్కొంది.

Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?
Hansika

బబ్లీ బ్యూటీ హన్సిక (Hansika) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో తనని వేధించాడంటూ (Casting Couch) ఆమె చెప్పినట్లుగా ఓ వార్త సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆ హీరో ఎవరంటూ?.. అంతా ఆమె నటించిన సినిమాల హీరోల పేర్లను సెర్చ్ చేస్తున్నారు. టాలీవుడ్‌ (Tollywood)లో ఆమె చాలా తక్కువ చిత్రాలలోనే నటించింది. దీంతో పలానా హీరో అంటూ ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలను గమనించిన హన్సిక వెంటనే రియాక్ట్ అవడమే కాకుండా.. తను అసలు అలా ఎక్కడా చెప్పలేదంటూ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు, ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలతో విసుగు వచ్చేస్తుందని తెలుపుతూ.. ఈ వార్తలు పుట్టించిన వారిపై సీరియస్ అయింది.

హన్సిక తన ట్వీట్‌లో (Hansika Tweet).. ‘‘సోషల్ మీడియాలో నా విషయంలో వినిపిస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమే. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి నిరాధారమైన వార్తలతో విసిగిపోయాను. దయచేసి ఇటుంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోండి. మీడియాకు నేను విజ్ఞప్తి చేసేది ఇదే’’ నంటూ హన్సిక ఫైర్ అయింది. ‘నేను ఎక్కడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటువంటి చెత్త వార్తలను ముద్రించడం ఆపండి’ అంటూ మరో ట్వీట్‌లో హన్సిక తెలిపింది. ఇలా హన్సిక తన ట్విట్టర్ వేదికగా వెంటనే రియాక్ట్ అవడంతో.. చాలా వరకు డ్యామేజ్‌ని ఆమె అడ్డుకుందనే చెప్పుకోవాలి.

Hansika.jpg

హన్సిక విషయానికి వస్తే.. ఇటీవలే తన బాల్య స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియా (Sohail Khaturiya)ను వివాహం చేసుకుంది. అంతకు ముందు తమిళ హీరో శింబు (Simbu)తో ఆమె పెళ్లి.. పీటల వరకు వెళ్లి ఆగింది. ఆ పెళ్లి ఆగిన కొన్నాళ్లకు సోహైల్ ఖతురియాను ఆమె పెళ్లాడింది. జైపూర్ వేదిగా జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, వ్యాపార ప్రముఖుల హాజరయ్యారు. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న ఆమెపై.. సడెన్‌గా ఈ రూమర్‌ రావడంతో.. వెంటనే స్పందించి.. ఆ రూమర్‌కి హన్సిక బ్రేక్ వేసింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

Updated Date - 2023-05-24T14:01:26+05:30 IST