Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

ABN , First Publish Date - 2023-05-23T19:26:12+05:30 IST

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌తో యుద్ధం కొన‌సాగిస్తున్న‌ప్పుడు.. సినిమా ఇండ‌స్ట్రీలో జీరో బ‌డ్జెట్ మూవీస్ ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో ఈ సినిమా ప్రారంభించామని అన్నారు దర్శకుడు వారణాశి సూర్య. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జీరో బ‌డ్జెట్ ఫిల్మ్ ‘గండ’ అనే చిత్ర టీజర్‌ని తాజాగా ప్రముఖ రచయిత శివ శక్తి దత్తా చేతుల మీదుగా విడుదల చేశారు.

Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ
Ganda Movie Teaser Launch

సినిమా అంటేనే కోట్ల బడ్జెట్‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. అలాంటిది ‘జీరో బ‌డ్జెట్’ (Zero Budget)తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య (Varanasi Surya) ఓ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ.. ఈజీ మూవీస్ బేన‌ర్‌పై ‘గండ’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ఫూర్తితో జీరో బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించానని అంటున్నారు ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్తా (Siva Shakthi Datta) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా శివశ‌క్తి ద‌త్త మాట్లాడుతూ.. వార‌ణాశి సూర్య చేస్తోన్న‌ జీరో బ‌డ్జెట్ చిత్రం గురించి విని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ త‌ర్వాత‌ ఆనందించాను. ఈ సినిమా స‌క్సెస్ కావాలని మ‌న‌స్పూర్తిగా ఆశీర్వ‌దించాను. డ‌బ్బు లేకున్నా చేయాల‌న్న ఉత్సాహం, త‌పన ఉంటే చాలని ఈజీ సినిమా వారు ఈ సినిమాతో నిరూపిస్తున్నారు. ఈ ప్ర‌యోగం ఎంతో మంది ఔత్సాహికుల‌కు ఆద‌ర్శంగా నిలవాల‌నీ, ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారాల‌ని కోరుకుంటున్నా. గండ అంటే మ‌గ‌వాడు అని అర్థం. ఈ సినిమా గండ‌రగండ‌డుగా పేరు తెచ్చుకోవాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఇలాంటి ప్రయోగం చేసిన వార‌ణాశి సూర్య‌కు నా అభినంద‌న‌లు తెలియజేస్తున్నానని అన్నారు. (Ganda Teaser Launched)

ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య మాట్లాడుతూ.. నేను కూడా మీడియా వ్య‌క్తినే. సినిమా మీద ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి వ‌చ్చాను. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మొద‌టి జీరో బ‌డ్జెట్ మూవీ ‘గండ’. మా టీమ్ అంతా కొత్త‌వారే. కంటెంట్ న‌మ్ముకుని సినిమా తీశాం. నాకు తెలిసింది సినిమా ఒక్క‌టే. అన్నీ వ‌దిలేసి ఈ సినిమా చేశాను. ఈ జీరో బ‌డ్జెట్ సినిమాకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ నేనే. మొద‌టి నుంచి స‌పోర్ట్ చేస్తూ వ‌స్తోన్న మా టీమ్ మెంబ‌ర్స్‌కి ధ‌న్య‌వాదాలు. ఇక నుంచి మా సంస్థ నుండి వ‌రుస జీరో బ‌డ్జెట్  చిత్రాలు వ‌స్తాయి. మా జీరో బ‌డ్జెట్ సినిమాకి అన్ని విధాలుగా స‌హ‌కరిస్తోన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్తా గారికి ధ‌న్య‌వాదాలు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan)గారు జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌తో యుద్ధం కొన‌సాగిస్తున్న‌ప్పుడు.. సినిమా ఇండ‌స్ట్రీలో జీరో బ‌డ్జెట్ మూవీస్ ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో ఈ సినిమా ప్రారంభించాం. ఆర్జీవీ‌ (RGV)గారు జీరో బడ్జెట్ మూవీస్ చేయవచ్చని ప‌న్నేండేళ్ల క్రిత‌మే చెప్పారు. అది కూడా ఈ సినిమాకు ఓ స్ఫూర్తి. ఈ సినిమాపై మా టీమ్ అంతా ఐదేళ్లు వ‌ర్క్ చేసాము. ఒక కొత్త ప్ర‌య‌త్నం ఎప్పుడూ మొద‌ట ఎన్నో విమ‌ర్శ‌ల‌కు, అవ‌మానాల‌కు గుర‌వుతుంది. అలాంటి ఎన్నో అవ‌మానాలు, విమ‌ర్శ‌లు త‌ట్టుకుంటూ ఈ సినిమా పూర్తి చేశాను. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. (Director Surya about Ganda Movie)

ఇవి కూడా చదవండి:

************************************************

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

Updated Date - 2023-05-23T19:26:30+05:30 IST