Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

ABN , First Publish Date - 2023-05-23T17:03:39+05:30 IST

‘బ్రో’ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ లుక్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. తాజాగా అందులోని సాయి ధరమ్ తేజ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సాయి తేజ్ మార్క్ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో ఆయన వైట్ అండ్ వైట్ డ్రస్‌లో దర్శనమివ్వగా.. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది
Sai Tej in Bro Movie

రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో సముద్రఖని (Samuthirakani) తెరకెక్కిస్తోన్న చిత్రానికి ‘బ్రో’ (Bro) అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడమే కాకుండా.. పవర్ స్టార్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ (Motion Poster)ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ బీభత్సమైన రెస్పాన్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి సాయి తేజ్ ‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. సాయి తేజ్‌ (Sai Tej) లుక్‌తో పాటు.. ఈ చిత్రంలో ఆయన పేరు, అలాగే మోషన్‌ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌ కూడా ఇప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటోంది.

సాయి తేజ్ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. వైట్ అండ్ వైట్ డ్రస్సులో స్టైలిష్‌గా సాయితేజ్ నడిచి వస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో గడియారం.. సినిమాకు సంబంధించి ఏదో హింట్ ఇస్తున్నట్లుగా ఉంది. ఈ లుక్‌లో సాయి తేజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన మార్కండేయులు (మార్క్) పాత్ర (Mark a.k.a Markandeyulu)లో కనిపించనున్నారని మేకర్స్ తెలియజేశారు. మొత్తంగా అయితే మొన్న వదిలిన పవన్ కల్యాణ్ లుక్, తాజాగా వచ్చిన సాయి తేజ్ లుక్.. ‘బ్రో’ సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందనేలా ఇండస్ట్రీకి సంకేతాలను పంపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి తేజ్ లుక్‌తో మరోసారి ‘బ్రో’ టైటిల్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (First Look of Sai Dharam Tej as Mark From Bro)

Bro-Movie.jpg

తన మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై జీ స్టూడియోస్‌ (ZEE Studios)తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ (SS Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

Updated Date - 2023-05-23T17:30:58+05:30 IST