Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

ABN , First Publish Date - 2023-10-12T23:56:51+05:30 IST

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?
Tiger Nageswara Rao Movie Still

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వంశీ (Vamsee) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ (Abhishek Agarwal Arts) బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌, అలాగే జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఎటువంటి స్పందనను రాబట్టుకున్నాయో తెలియంది కాదు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌లో యమా స్పీడ్‌గా ఉన్న టీమ్.. తాజాగా సినిమాలోని థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Icchesukuntaale Lyrical Video Song)

బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్‌తో ఆకట్టుకుంది. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్‌ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ అని చెప్పుకోవాలి. అలాగే, విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీ‌గా వున్నాయి. ఒక్కసారి వింటే చాలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, విజువల్స్ కుదిరాయి. ఈ పాట మేకింగ్ సీన్స్ చూస్తుంటే.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. (Tiger Nageswara Rao Movie Third Single)


TNR-Movie.jpg

నూపుర్ సనన్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది. (Tiger Nageswara Rao Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

***********************************

* Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్

***********************************

*Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*******************************

*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

************************************

Updated Date - 2023-10-13T00:02:56+05:30 IST