Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-10-12T17:27:58+05:30 IST

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ సిరీస్ చిత్రాలతో హిట్ అందుతోన్న శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్ర టీజర్‌ని అక్టోబర్ 16న విడుదల చేయబోతున్నారు.

Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
Victory Venkatesh In Saindhav Movie

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా ‘హిట్’ (Hit) సిరీస్ చిత్రాలతో హిట్ అందుతోన్న శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’ (Saindhav). నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment) బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని సంక్రాంతి‌కి విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. విడుదల తేదీని కూడా ప్రకటించారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గురువారం అనౌన్స్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రపై ఇప్పటికే భారీగా అంచనాలు మొదలయ్యాయి. టీజర్ విడుదల అనంతరం ఆ అంచనాలు డబుల్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. టీజర్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని పూర్తయినట్లుగా తెలుస్తోంది. (Saindhav Teaser Release Date)


Venkatesh.jpg

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్ ప్రేక్షకులకు ‘సైంధవ్’ వరల్డ్ గురించి ఇన్ సైట్ ఇవ్వనుందని చిత్రబృందం తెలుపుతోంది. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఎస్ మణికందన్ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. టీజర్‌ రిలీజ్ అప్‌డేట్‌తో ప్రస్తుతం ‘సైంధవ్’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Saindhav Pan India Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

************************************

*Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు

*********************************

*Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

*********************************

*God: జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

*********************************

Updated Date - 2023-10-12T17:30:30+05:30 IST