Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-10-12T19:58:09+05:30 IST

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్ నాన్న’. ఇప్పటికే విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్ర గ్లింప్స్‌ దేశవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
Hi Nanna Movie Poster

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటిస్తోన్న యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఇప్పటికే విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్ర గ్లింప్స్‌ దేశవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో ‘హాయ్ నాన్న’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Hi Nanna Teaser Release Date)

చిత్రబృందం ప్రకటించిన ప్రకారం.. ‘హాయ్ నాన్న’ టీజర్ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన టీజర్ పోస్టర్ లీడ్ పెయిర్ -నాని, మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)ల డ్రీమ్ కెమిస్ట్రీని చూపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కోర్ పాయింట్‌ను టీమ్ ఇంకా వెల్లడించకపోవడంతో, సినీ ప్రేక్షకులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌తో స్టోరీ లైన్ ఏమిటనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. (Hi Nanna Movie)


Nani.jpg

శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా (Baby Kiara Khanna).. నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న (Hi Nanna Release Date) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

* Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్

***********************************

*Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*******************************

*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

************************************

*Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు

*********************************

*Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

*********************************

Updated Date - 2023-10-12T19:58:44+05:30 IST