Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

ABN , First Publish Date - 2023-10-12T16:23:55+05:30 IST

‘ఇళయదళపతి’ విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘లియో’.. ఈనెల 19న విడుదలకానున్న నేపథ్యంలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటును కల్పించింది.

Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..
Vijay and Lokesh Kanagaraj

‘ఇళయదళపతి’ విజయ్‌ (Ilayathalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘లియో’ (Leo).. ఈనెల 19న విడుదలకానున్న నేపథ్యంలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటును కల్పించింది. సినిమా విడుదల రోజైన 19వ తేదీ గురువారం మాత్రం తొలి ఆటను ఉదయం 5 గంటలకు ప్రారంభించవచ్చు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు నాలుగు ఆటలతో పాటు ప్రత్యేక షో ఉదయం 9గంటలకు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి. అముద పేర్కొన్నారు.

సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ (Seven Screen Studios) బ్యానర్‌పై నిర్మాత లలిత్‌కుమార్‌ నిర్మించగా యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. త్రిష (Trisha) హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ (Sanjay Dutt) ప్రతినాయకుడిగా నటించారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Action King Arjun) మరో ముఖ్యపాత్రను పోషించారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కాగా, అందులోని అసభ్య డైలాగ్‌ను సెన్సార్‌ బోర్డు తొలగించింది. ఈ సినిమా రన్‌ టైం 164 నిమిషాల 52 సెకన్లు.


vijay-Pic.jpg

మరోవైపు, ‘లియో’ (Leo) కోసం పనిచేసిన డ్యాన్సర్లకు నిర్మాత డబ్బులు చెల్లించలేదంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి ఖండించారు. ఒక పాట చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు పనిచేసిన డ్యాన్సర్లందరికీ రోజుకు రూ.1750 చొప్పున చెల్లించారని ఆయన పేర్కొన్నారు. దీంతో ‘లియో’కి ఉన్న వివాదాలన్నీ తొలిగినట్లు అయింది. ఈ సినిమా 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు

*********************************

*Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

*********************************

*God: జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

*********************************

Updated Date - 2023-10-12T16:58:12+05:30 IST