Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

ABN , First Publish Date - 2023-10-12T23:35:58+05:30 IST

ఈ మధ్య ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్ట్‌‌ను ఖండిస్తూ ఎక్కడెక్కడివారో ‘వుయ్ ఆర్ విత్ సిబిఎన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలు చేశారు. కానీ.. కట్టె కాలే వారకు తెలుగు దేశమే అంటూ ఆ మధ్య స్టేట్‌మెంట్ వదిలిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంత వరకు ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ కాలేదు. దీనిపై ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల వివరణ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?
NT Ramarao and NCBN

ఈ మధ్య ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ని ఏపీలో అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్ట్‌‌ను ఖండిస్తూ ఎక్కడెక్కడివారో ‘వుయ్ ఆర్ విత్ సిబిఎన్’ (We Are with CBN) అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలు చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు ఈ అక్రమ అరెస్ట్‌ను ఖండించారు.. ఖండిస్తున్నారు. కోర్టులో కూడా వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై అందరూ స్పందించారు కానీ.. కట్టె కాలే వారకు తెలుగుదేశమే అంటూ ఆ మధ్య స్టేట్‌మెంట్ వదిలిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) మాత్రం ఇంత వరకు ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ కాలేదు. అతను రియాక్ట్ కాలేదనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ట్రోల్స్ నడిచాయి. అయినా ఎన్టీఆర్‌లో కదలిక లేదు. ఇప్పుడంతా ఎన్టీఆర్ స్పందన గురించి దాదాపు మాట్లాడుకోవడమే మానేశారు. ఇలాంటి టైమ్‌లో ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల చేసిన కొన్ని కామెంట్స్ ఈ విషయాన్ని మరోసారి హైలెట్ అయ్యేలా చేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఎందుకు ఎన్టీఆర్ (NTR).. ఇంత పెద్ద ఇష్యూపై మాట్లాడలేదనే దానికి సమాధానం అన్నట్లుగా రాజీవ్ కనకాల (Rajeev Kanakala) సమాధానం ఉంది. తాజాగా రాజీవ్ కనకాల తన కుమారుడు హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. దీనికి రాజీవ్ కనకాల తనదైన తరహాలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడాయన చెప్పిన సమాధానం వైరల్‌గా మారుతూ.. మరోసారి ఎన్టీఆర్‌ని వార్తలలోకి తీసుకొచ్చాయి. ఇంతకీ రాజీవ్ కనకాల ఏమని సమాధానం ఇచ్చారంటే..


jr-ntr.jpg

రాజమౌళి (Rajamouli)‌తో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల సమయం కేటాయించాడు. ఈ నాలుగేళ్ల కాలంలో మూడు నాలుగు సినిమాలు చేయగలిగే అవకాశం పోగొట్టుకున్న తారక్.. ఇప్పుడు కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘దేవర’ (Devara) కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు వేరే విషయాలను పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఆయన ధ్యాసంతా సినిమాపైనే ఉందని నేను అనుకుంటున్నాను అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. అయితే పూర్తి వివరాలు మాత్రం తనకి తెలియవని, ఈ మధ్య కాలంలో ఆయనని కలవలేదని వెల్లడించారు.

అయితే రాజీవ్ కనకాల సమాధానం కొందరికీ నచ్చలేదు. ఈ సినిమా చేస్తూ కూడా కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో ఎన్టీఆర్ చేస్తున్నాడు. మీడియా ముందుకు వచ్చి, లేదంటే సోషల్ మీడియాలో అయినా స్పందించవచ్చు. దీనికి రెండు నిమిషాల టైమ్ కూడా పట్టదు. అది కూడా కేటాయించలేకపోతున్నాడా? పుట్టినరోజు మెసేజ్‌లు, టీజర్ లాంచ్ చేయడం వంటివి బాగానే చేస్తున్నాడుగా? అంటూ రాజీవ్ కనకాల చెప్పేది అస్సలు సూట్ కావడం లేదని.. కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

============================

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

***********************************

* Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్

***********************************

*Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*******************************

*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

************************************

Updated Date - 2023-10-13T00:16:52+05:30 IST