Sonu Sood: ఇదో యుద్ధం.. నెపోటిజంపై సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-16T10:25:59+05:30 IST

ఎటువంటి సపోర్టు లేకుండా బాలీవుడ్‌ (Bollywood)లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు సోనూ సూద్ (Sonu Sood).

Sonu Sood: ఇదో యుద్ధం.. నెపోటిజంపై సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
Sonu Sood

ఎటువంటి సపోర్టు లేకుండా బాలీవుడ్‌ (Bollywood)లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు సోనూ సూద్ (Sonu Sood). ఈ నటుడు సౌతిండియాలోనూ పలు చిత్రాల్లో నటించిన అక్కడ సైతం మంచి పాపులారిటీ సాధించాడు. అయితే.. సోనూకి నటుడిగా కంటే.. కరోనా మహమ్మారి సమయంలో పేదవారికి సాయం చేసి మంచి వ్యక్తిగా ఎక్కువ గుర్తింపు పొందాడు. అయితే.. సినిమా పరిశ్రమలో నెపోటిజం (Nepotism)పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై తాజాగా సోనూ కూడా స్పందించాడు.

సోనూ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో బంధుప్రీతి (నెపోటిజం) ఉంది. అది ఇకపై కూడా ఉంటుంది. అమ్మ లేడా నాన్న ఇండస్ట్రీకి చెందిన వారైతే వారి పిల్లలకి అవకాశాలు చాలా సులభంగా వస్తాయి. ఇది ఓ యుద్ధంలాంటిది. అందులో మీరు పోరాడి గెలవాలి తప్పదు. అదే ఇక్కడ ముఖ్యం. అది మీ శక్తిని ఈ ప్రపంచానికి చూపిస్తుంది. (Sonu Sood on Nepotism)

మా నాన్నకి బట్టల దుకాణం ఉంది. కాబట్టి నేను మా నాన్నగారి దుకాణంలో కూర్చోవడం చాలా సులభం. అప్పుడు పాత కస్టమర్లు చాలా సులభంగా వస్తారు. కాబట్టి , దర్శకుడి కొడుకు నటుడిగా మారితే ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే అతను అలాంటి వాతావరణంలో పెరిగాడు’ అని చెప్పుకొచ్చాడు.

సోను ఇంకా మాట్లాడుతూ.. ‘మీరు బయటి వ్యక్తులను ఓ పాత్ర కోసం తీసుకోకపోతే, మీరు చిత్ర పరిశ్రమ ఓ మూసలో పడిపోతుంది. ఏం కొత్తదనం ఉండదు. ఇండస్ట్రీ‌లో బయటి వ్యక్తులకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు’ అని తెలిపాడు. (Sonu Sood on Nepotism)

అలాగే.. బాయ్‌కాట్ బాలీవుడ్‌పై స్పందిస్తూ.. ‘ప్రజలు ఇప్పుడు చాలా సెన్సిటివ్‌గా అయ్యారు. సినిమాని బహిష్కరించాలని కోరే వ్యక్తులకి సరైన కారణం ఉందా లేదా అనేది నా అనుమానం. సినిమాని చూడకుండా దాన్ని బహిష్కరించడం సరైందికాదు’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Updated Date - 2023-03-16T10:29:47+05:30 IST