#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2023-03-15T10:10:26+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీతో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు.

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్
NTR

‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీతో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఎస్‌ఎస్ రాజమౌళికి అయితే పలువురు హాలీవుడ్ ప్రముఖులు అక్కడ సినిమా చేయమని ఆఫర్లు సైతం ఇచ్చారు. ఇప్పటికే పలు అవార్డులు గెలిచి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఈ తరుణంలోనే ఆస్కార్స్ అవార్డు రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఎక్కువ సార్లు సోషల్‌ మీడియాలో ప్రస్తావనకు వచ్చిన నటుల జాబితాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.

అయితే.. గత కొంతకాలంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హాలీవుడ్‌కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న మార్వెల్ స్టూడియో ‘అవెంజర్స్’ సినిమాల్లో ఎన్టీఆర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని షేర్ చేసిన పోస్టర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో ‘బ్లాక్ పాంథర్: వాకండా ఫరేవర్’కి సంబంధించిన పోస్టర్‌ షేర్ చేశారు. దానికి.. కింగ్ టి'చల్లా కుమారుడు ప్రిన్స్ టి'చల్లాగా ఎన్టీఆర్ నటించనున్నట్లు రాసుకొచ్చారు.

ఈ వైరల్ పోస్ట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అంటే అన్నాడుగాని ఆ ఊహ ఎంత బావుందో’.. ‘అదే నిజమైతే పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇది కుదిరేలా చేయమని మార్వెల్ స్టూడియోస్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..


Updated Date - 2023-03-15T10:42:02+05:30 IST