SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

ABN , First Publish Date - 2023-03-15T11:23:21+05:30 IST

ఆస్కార్ అవార్డు గెలిచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’
SS Rajamouli

ఆస్కార్ అవార్డు గెలిచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 95 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ గెలిచిన మొదటి ఏసియన్‌కి చెందిన పాటగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ నిలిచింది. ఇంతకుముందే పలు అవార్డుల గెలిచి గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయిన ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli), రామ్‌చరణ్ (Ramcharan), ఎన్టీఆర్ (NTR) క్రేజ్ ఈ అవార్డుతో మరింత పెరిగింది. ముఖ్యంగా రాజమౌళికైతే పలువురు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అక్కడ సినిమా చేయమని ఆఫర్లు ఇచ్చారు. అయితే.. ఆస్కార్ గెలిచిన అనంతరం హాలీవుడ్ మీడియాతో రాజమౌళి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకి ముందు తనకి ఎదురైన ఇబ్బందులు, బెదిరింపుల గురించి పంచుకున్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఏదైనా చిత్రంపై విమర్శలు రాకపోతే ఆ చిత్రంపై ప్రేక్షకులకి ఆసక్తి లేదని అర్థం. 12 సినిమాలు తీసిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైంది. ఓ మూవీకి ప్రచారం రావడం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక కారణంతో దాన్ని విమర్శించే వ్యక్తులు ఉంటూనే ఉంటారు.

ఆర్ఆర్ఆర్‌లోని హీరోలలో ఒకరు స్కల్ క్యాప్ ధరించి ముస్లింగా కనిపిస్తాడు. అది చూసి ఓ రైట్‌వింగ్ రాజకీయ నాయకుడు నేను ఆ సన్నివేశాన్ని తొలగించకపోతే థియేటర్‌ను తగలబెడతానని, నన్ను బహిరంగంగా కొడతానని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. నేను హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్నానంటూ చాలామంది వామపక్ష వ్యక్తులు నాపై నిందలు వేశారు’ అని రాజమౌళి తెలిపారు.

అలాగే రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. ‘అయితే, ఏ విషయం గురించి పోరాడుతున్నప్పటికీ నాకు అతివాద వ్యక్తులు నచ్చరు. ఎందుకంటే.. వారికి ఓ నిర్దిష్ట పాత్ర ఎందుకు టోపీ ధరించి ఉంటుందో చూసే ఓపిక లేదు. అలాగే మరికొందరు హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్నానని చెప్పడానికి సాకులు వెతుకుతూ ఉంటారు. వారు తీవ్ర జాతీయవాదులు, నకిలీ ఉదారవాదులు. నేను కూడా వారిలో ఒకడిని కానందుకు సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

కాగా.. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గురించే అని అందరికీ తెలుసు. ఆయనే ఆస్కార్ వచ్చిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అలాగే మరికొందరూ ‘బాహుబలి’ సినిమాలతో హిందు వాదాన్ని ప్రచారం చేస్తున్నాడని జకన్నపై విమర్శలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో.. ఈ రెండు వర్గాలకు చెందిన వ్యక్తులకు రాజమౌళి ఒకేసారి సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-15T11:42:22+05:30 IST