Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

ABN , First Publish Date - 2023-03-14T10:41:13+05:30 IST

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (Oscar Award) వచ్చిన సంగతి తెలిసిందే.

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..
RRR

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (Oscar Award) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ సంతోషంలో మునిగిపోయారు. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఈ చిత్రబృందంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అయితే.. ఇద్దరు హాలీవుడ్ భామలు ఈ అవార్డుని ప్రకటిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది ‘ఆర్ఆర్ఆర్’తోపాటు భారతీయ సినీ అభిమానుల కోపానికి కారణమైంది. (Oscars95)

ఆ వీడియోలో.. అవార్డు ప్రకటించగానే ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), కార్తీకేయ, రమా రాజమౌళి ఆనందంతో గంతులు వేశారు. ఆ సమయంలో ఉపాసన కూడా వారి పక్కనే ఉండి చప్పట్లు కొట్టారు. అయితే.. వారు ఆ స్టూడియోలో చివరి వరుస కూర్చుని ఉండడం నెటిజన్ల కోపానికి కారణమైంది. దీంతో ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

‘‘ఆర్ఆర్ఆర్’ టీంకి ఇది అవమానం.. వారిని ఆడిటోరియమ్ చివరిలో కూర్చోబెడతారా’.. ‘గొప్ప విజయమే. కానీ వారు చివరిలో ఎందుకు కూర్చున్నారు’.. ‘అసలు మీకు అమెరికా బయట ఓ ప్రపంచం ఉందని ఎప్పుడు తెలుసుకుంటారు?’.. అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-03-14T10:47:44+05:30 IST