SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

ABN , First Publish Date - 2023-03-12T12:44:41+05:30 IST

టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు.

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..
SIR

టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఇప్పటి వరకు తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు పలకరించిన ఈ నటుడు.. ఇటీవలే డైరెక్ట్ తెలుగు సినిమా చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో వచ్చిన ‘సార్’ (SIR) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), నిర్మాతగా వ్యవహరించగా.. సంయుక్తా మీనన్ (Samyuktha Menon) ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళంలోనూ ‘వాతి’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. (#SirMovie)

‘సార్’ సినిమా చాలామంది సినీ విమర్శకులకి నచ్చలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లనే సాధించింది. ప్రేక్షకుల సైతం సినిమా బావుందనే ప్రచారం చేశారు. అయితే.. చాలామందికి ఈ మూవీని థియేటర్‌లో చూడడం కుదరలేదు. అలాగే, మరికొందరేమో ఈ చిత్రం ఓటీటీలో విడుదలైతే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ ‘సార్’ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. (#SirMovie)

‘సార్’ మూవీ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అందులో.. ‘ధనుష్ మా సార్ అయితే, మేము అతని క్లాస్‌కి హాజరుకావడానికి, పీటీ పీరియడ్‌ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం! వాతి (సార్) మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌కి వస్తోంది!’ అని రాసుకొచ్చింది. (#SirMovieOTTstreaming)

ఇవి కూడా చదవండి:

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..


Updated Date - 2023-03-12T13:00:23+05:30 IST