Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

ABN , First Publish Date - 2023-03-13T09:15:03+05:30 IST

అనుకున్నది.. అందరూ కోరుకున్నదే జరిగింది.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ గెలుచుకుంది.

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..
NTR

అనుకున్నది.. అందరూ కోరుకున్నదే జరిగింది.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ గెలుచుకుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంగీత ప్రియులను కాలు కదిపేలా చేసింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లోనూ విదేశీయులు సైతం ఈ పాటలోని బీట్‌కి ఫిదా అయిపోయారు. కాగా.. ఈ వేడుక కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఎం.ఎం.కీరవాణీ, ఎస్ఎస్ రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అంటెండ్ అయ్యారు. కాల భైరవ్, రాహుల్ కలిసి ఆస్కార్ స్టేజ్‌పై లైవ్‌లో నాటు నాటు పాట పాడడం విశేషం.

రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించారు. ఈ తరుణంలో ఓ విశేషం చోటు చేసుకుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సూట్‌ని ఎన్టీఆర్ ధరించాడు. దానిపై పులిబొమ్మ ఉంది. కరెక్ట్‌గా ఎన్టీఆర్ భుజంపైకి వచ్చి.. అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ పులి బొమ్మ గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు. వారు ఆ బొమ్మ ఎందుకు వేసుకొచ్చావని ఓ యాంకర్ అడగగా.. ‘ఆర్ఆర్ఆర్‌లో చూశారు కదా. నాతో పాటు కనిపించింది. నిజానికి, పులి.. భారత జాతీయ జంతువు. మా దేశ సింబల్‌తో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’ అని చెప్పి ఎన్టీఆర్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. అది విన్న యాంకర్ నిన్ను చూస్తే సౌత్ ఏసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు. కాగా.. జిమ్మి కిమ్మెల్ మూడో సారి హోస్ట్‌గా వ్యవహారిస్తున్న ఈ ఈవెంట్‌లో.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ సైతం ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్’ విభాగంలో అవార్డును గెలుచుకోడం విశేషం.

ఇవి కూడా చదవండి:

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Updated Date - 2023-03-13T09:30:13+05:30 IST