Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

ABN , First Publish Date - 2023-03-16T09:16:35+05:30 IST

ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసే అతి కొద్దిమందిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఒకరు.

Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసే అతి కొద్దిమందిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఒకరు. ఆయన ఎంతోమందికి అలా సహాయం చేశారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు పొన్నంబలం (Ponnambalam)కి కూడా మెగాస్టార్ హెల్ప్ చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆ నటుడే వెల్లడించాడు.

విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌతిండియాలో గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. కోలీవుడ్ నటుడైనప్పటికీ టాలీవుడ్‌లోనూ ఆయనకి మంచి పాపులారిటీ ఉంది. చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అనంతరం ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించి అలరించాడు. (Actor Ponnambalam)

ponam.jpg

ఇటీవలికాలంలో చాలా తక్కువ సినిమాల్లో నటించిన పొన్నంబలం.. గతేడాది కీడ్ని సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో వైద్యం చేసుకోడానికి డబ్బులు లేక ఆర్థికంగా కష్టపడ్డాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవికి మేసేజ్ చేయడం ఆయన వైద్యం చేయించారని పొన్నంబలం తాజాగా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

అందులో.. ‘గతేడాది నాకు కిడ్నీ సమస్య వచ్చింది. ఎవరైనా సాయం చేస్తారని చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ దగ్గర నెంబర్ తీసుకుని అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్‌ చేశాను. అది చూసి వెంటనే అన్నయ్య ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌ వస్తారా అని అడిగారు. కష్టమని చెప్పడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అక్కడి వెళ్లగా, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నన్ను అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్‌మేంట్ అయినా మొత్తం ఖర్చు రూ.40 లక్షలను ఆయనే భరించారు. నిజానికి అడగ్గానే ఒకటో, రెండో లక్షలు చిరంజీవి సాయం చేస్తారని అనుకున్నా. వైద్యాన్ని అవసరమయ్యే రూ.40 లక్షలు ఆయనే ఇస్తారని అనుకోలేదు’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. (Megastar Chiranjeevi)

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-16T09:21:10+05:30 IST