OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-16T08:04:28+05:30 IST

కరోనా కారణంగా చాలా రంగాలు నష్టపోగా.. ఓటీటీలకు మాత్రం మంచి జరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా చాలా రంగాలు నష్టపోగా.. ఓటీటీలకు మాత్రం మంచి జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌ ఫీల్ అవుతున్న సినీ ప్రేమికులకి వినోదాన్ని పంచాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా మార్చి 15న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

Black Adam (బ్లాక్ ఆడం)

డీసీ స్టూడియో నుంచి వచ్చిన మరో సూపర్ హీరో మూవీ 'బ్లాక్ ఆడం'. 2019లో వచ్చిన షాజామ్ మూవీకి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ డీసీ సిరీస్ మూవీలో ఇది 11వ చిత్రం. డ్వేన్ జాన్సన్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2022న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈజిప్షియన్ దేవతల ఓ వ్యక్తికి దైవిక శక్తి వస్తుంది. అయితే, అతని ప్రవర్తన కారణంగా దాదాపు 5000 సంవత్సరాలు గార్డుహౌస్‌లో ఆ దేవుళ్లు అతన్ని బంధిస్తారు. అనంతరం అప్పటి వరకు అతనికి ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Black-Adam.jpg

జిందగీ శత్రంజ్ హై (Zindagi Shatranj Hai)

ఒక జంటకి వివాహం జరుగుతుంది. కానీ భార్య ఆ వ్యక్తిని తన భర్తగా అంగీకరించడానికి నిరాకరిస్తుంది. ఇదిలా ఉంటే నగరంలో హత్యలు జరుగుతున్నాయి. దీంతో ఆ దంపతుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది 'జిందగీ శత్రంజ్ హై' కథాంశం. ఈ హిందీ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Zindagi.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

The Law of the Jungle - స్పానిష్

Ikebukuro West Gate Park - జపనీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

Unprisoned - ఇంగ్లిష్

Turning the Tables with Robin Roberts Season 2 - జపనీస్

జీ 5 (ZEE 5)

Resident Evil: Damnation - జపనీస్, ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ

యూట్యూబ్ (YouTube)

Pretender - హిందీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

Shayar Khurafati - హిందీ

ఇవి కూడా చదవండి:

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-16T08:04:32+05:30 IST