Ranbir Kapoor: నా కూతురు తైమూర్‌లా కాకూడదు.. బాలీవుడ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-03-16T14:07:19+05:30 IST

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం తన తాజా చిత్రం ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkar) విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Ranbir Kapoor: నా కూతురు తైమూర్‌లా కాకూడదు.. బాలీవుడ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్
Ranbir kapoor

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం తన తాజా చిత్రం ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkar) విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. మార్చి 8 న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఓ చాట్‌ షోలో రణ్‌బీర్ పాల్గొన్నాడు. ఆ షోకి సైఫ్ అలీఖాన్ భార్య, తన కజిన్ కరీనా కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. తన కూతురు రాహ కపూర్ (Raha Kapoor) గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Kareena-kapoor1.jpg

రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘బొడ్డు తాడు తెంపిన వెంటనే నేను రాహని ఎత్తుకున్నాను. ఆ క్షణం నా జీవితంలో పెద్ద జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఆ సమయంలో ఆకాశంలో తెలియాడుతున్నట్లు అనిపించింది. తండ్రిగా ఈ దశని చాలా ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

అలాగే.. రాహపై మీడియా అటెన్షన్ గురించి మాట్లాడుతూ.. ‘ఓ నటుడిగా నాపై ఎప్పుడూ మీడియా కన్ను ఉంటుంది. అది సహజం. కానీ ఆ ప్రభావం నా కూతురు రాహ మీద పడకూడదు అనుకుంటున్నా. నీ కుమారుడు తైమూర్‌ చాలాసార్లు మీడియాలో కంట్లో పడ్డాడు. అతనికి చాలా పాపులారిటీ వచ్చేసింది. కానీ.. నా కూతురు రాహని మాత్రం మీడియాకి దూరంగా ఉంచాలని అనుకుంటున్నా’ అని కరీనాతో రణ్‌బీర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

Actor Ponnambalam: ‘తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు.. చేతబడి చేయడంతో..’

Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Updated Date - 2023-03-16T14:07:19+05:30 IST