Actor Ponnambalam: ‘తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు.. చేతబడి చేయడంతో..’

ABN , First Publish Date - 2023-03-16T11:36:34+05:30 IST

స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా చేసి 1980-90లలో సౌతిండియా మొత్తం గుర్తింపు సాధించిన నటుడు పొన్నంబలం (Ponnambalam)..

Actor Ponnambalam: ‘తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు.. చేతబడి చేయడంతో..’

స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా చేసి 1980-90లలో సౌతిండియా మొత్తం గుర్తింపు సాధించిన నటుడు పొన్నంబలం (Ponnambalam). ఈ తమిళ నటుడు ‘ఘరానా మొగుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అనంతరం కన్నడ, మలయాళంలోనూ చిత్రాలు చేసి అక్కడ సైతం తనకంటూ గుర్తింపు సాధించాడు. అయితే.. గతేడాది ఈ నటుడు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. ఈ సందర్భంగా చికిత్స తీసుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పొన్నంబలం తెలియజేశాడు. అలాగే.. తన సొంత తమ్ముడే తనని చంపడానికి ప్రయత్నించాడని ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. (Tamil Actor Ponnambalam)

పొన్నంబలం మాట్లాడుతూ.. ‘‘మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు. నా వాళ్లే నన్ను చంపడానికి ప్రయత్నించారు. నా తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించా. అందుకే అతనికి నా మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చా. అప్పటి నుంచి నా వృత్తిపరమైన విషయాలన్నీ అతనే చూసుకునేవాడు. అతన్ని నేను చాలా నమ్మాను. కానీ.. అతను నేను తాగే బీర్‌లో స్లో పాయిజన్‌ (slow poison) కలిపాడు. అలాగే నేను తినే ఆహారంలోనూ కలిపేవాడు. నా ఎదుగుదల చూసి ఓర్వలేక అలా చేశాడు. అంతటితో ఆగకుండా.. డబ్బు కోసం నాపై చేతబడి సైతం చేయించాడని ఇటీవలే నాకు తెలిసింది. అందువల్లే నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే అలా జరిగిందని తెలిపారు. నేను అతని మంచి కోరి ఉద్యోగం ఇస్తే అతను మాత్రం నన్ను చంపాలని చూశాడు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. (Brother Gave Slow Poison)

ఇవి కూడా చదవండి:

Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Updated Date - 2023-03-16T11:40:29+05:30 IST