Maidaan Teaser: షూస్ లేకుండానే.. టీజర్‌లో హైలెట్ ఇదే..

ABN , First Publish Date - 2023-03-30T17:26:26+05:30 IST

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటిస్తున్న సినిమా మైదాన్ (Maidaan). హైదరాబాదీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీం (Syed Abdul Rahim) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు.

Maidaan Teaser: షూస్ లేకుండానే.. టీజర్‌లో హైలెట్ ఇదే..

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటిస్తున్న సినిమా మైదాన్ (Maidaan). హైదరాబాదీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీం (Syed Abdul Rahim) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.

ఇండియన ఫుట్‌బాల్‌‌లో స్వర్ణయుగమైన 1952 నుంచి 1962 మధ్య దశాబ్దాన్ని మైదాన్‌ సినిమాలో చూపించనున్నారు. ఈ దశాబ్దా కాలంలో ఇండియన్ టీమ్ ఒలింపిక్స్‌కు రెండు సార్లు క్వాలిఫై అయింది. అనేక అడ్డంకులను ఎదుర్కొని మెగా ఈవెంట్‌లో పాల్గొంది. కొన్ని మ్యాచుల్లో అయితే ఆటగాళ్లు షూస్ లేకుండానే ఉట్టి పాదాలతోనే ఆడారు. ‘మైదాన్’ టీజర్‌ను అజయ్ దేవగణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మైదానంలో పదకొండు మంది దిగితే ఒక్కరు మాత్రమే ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఓ రియల్ కథ. టీజర్ విడుదలైంది’’ అని ఆయన పోస్ట్ పెట్టారు.

సయ్యద్ అబ్దుల్ రహీం అనేక రికార్డులను క్రియేట్ చేశారు. 60ఏళ్లు అయినప్పటికీ ఆ రికార్డులను ఎవరు చెపిపేయలేకపోయారు. ఈ చిత్రంలో ప్రియమణి (Priyamani), గజరాజ్ రావ్ (Gajraj Rao), రుద్రనీల్ ఘోష్ (Rudranil Ghosh) తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌తో కలసి బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా నిర్మించారు. ఏఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యవాప్తంగా జూన్ 23న విడుదల కానుంది. అజయ్ దేవగణ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టుని తీసుకున్నారు. రెండేళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ, పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-30T17:27:17+05:30 IST