scorecardresearch

Kamal hassan: 36 ఏళ్ల క్రితం అలా.. ఇప్పుడు ఇలా!

ABN , First Publish Date - 2022-06-13T18:31:43+05:30 IST

పై ఫొటో భలే చూడముచ్చటగా ఉంది కదూ! అందులో ఒకటి రెండు రోజుల క్రితం కమల్‌హాసన్‌ చిరంజీవి స్వగృహంలో కలిసి పార్టీ చేసుకున్న సందర్భం... మరో ఫొటో 36 ఏళ్ల క్రితం ఓ వేడుకలో చిరంజీవి, కమల్‌హాసన్‌ కలిసిన ఫొటో. ఇలాంటి అరుదైన ఫొటో స్టోరీలు అభిమానులకు భలే కిక్‌ ఇస్తాయి. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Kamal hassan: 36 ఏళ్ల క్రితం అలా.. ఇప్పుడు ఇలా!

పై ఫొటో భలే చూడముచ్చటగా ఉంది కదూ! అందులో ఒకటి రెండు రోజుల క్రితం కమల్‌హాసన్‌ (Kamal hassan), చిరంజీవి(Chiranjeevi) స్వగృహంలో కలిసి పార్టీ చేసుకున్న సందర్భం... మరో ఫొటో 36 ఏళ్ల క్రితం ఓ వేడుకలో చిరంజీవి, కమల్‌హాసన్‌ కలిసిన ఫొటో. ఇలాంటి అరుదైన ఫొటో స్టోరీలు అభిమానులకు భలే కిక్‌ ఇస్తాయి. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వ్యక్తిగతంగా చిరు, కమల్‌హాసన్‌ ఎన్నోసార్లు కలిసుండొచ్చు. కానీ ఒకే వేదిక మీద ఇద్దరూ కలవడం అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ‘విక్రమ్‌’ (Vikram)సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం  హైదరాబాద్‌ వచ్చిన కమల్‌ను చిరంజీవి ఇంటికి ఆహ్వానించి సన్మానించారు. అనంతరం కొందరు హీరోల సమక్షంలో పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman khan)కూడా ఉన్నారు. ఈ ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. 


కమల్‌హాసన్‌, చిరంజీవి ఒకే వేదికపై ఉన్న ఓ పాత ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 36 ఏళ్ల క్రితం జరిగిన ఓ వేడుకలోని ఫొటో ఇది. కమల్‌హాసన్‌ నటించిన ‘స్వాతిముత్యం’ చిత్రం శతదినోత్సవ వేడుక హైదరాబాద్‌, దేవి థియేటర్‌లో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రాజ్ కపూర్‌ హాజరయ్యారు. చిరంజీవి, రాజ్ కపూర్‌.. కమల్‌హాసన్‌కు శతదినోత్సవ జ్ఞాపికను బహుకరించారు. 36 ఏళ్ల క్రితం జరిగిన ఈ వేడుకలోని ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. అప్పటి ఫొటోలో రాజ్ కపూర్‌ ఉంటే.. నేటి ఫొటోలో సల్మాన్‌ఖాన్‌ ఉన్నారు. 






Updated Date - 2022-06-13T18:31:43+05:30 IST