Anupama Parameswaran: టైమ్‌ గురించి చెబితే.. నీ డబ్బేం కాదుగా అంటారు.

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:32 PM

‘పరదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. ఆగస్ట్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఏపథ్యంలో ఆమె ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ప్రవీణ్‌ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరదా’ (parada) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ఆగస్ట్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఏపథ్యంలో ఆమె ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్‌ అడిగే చిన్న చిన్న విషయాలను కూడా చిత్రబృందం సీరియస్‌గా తీసుకుంటుంది. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి వాళ్లకు నచ్చని విషయాలు చెబితే వెంటనే పొగరుఅంటారు. చిత్రీకరణ అనుకున్న సమయానికి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తే యాటిట్యూడ్‌ ఉందని అంటారు. గతంలో ఇలాంటివి నేను ఎన్నో చూశాను. ఉదయం 7 గంటలకు రెడీ అయితే.. 9.30 వరకు చిత్రీకరణ మొదలుకాదు. కో స్టార్స్‌ లేట్‌గా వస్తారని తెలిసినా నేను మాత్రం ఏడు గంటలకు రెడీగా ఉండాలి. వాళ్ల కోసం గంటన్నర ఎదురుచూడాలి. ఇదే విషయాన్ని టీమ్‌ను అడిగితే పొగరు ఎక్కువైంది అని అంటారు. అలా నన్ను కొందరు అన్నారు. అలా అన్న ప్రతిసారీ ఎంతో బాధపడ్డా. ఇప్పుడు అసలు ఆ తరమా మాటల్ని పట్టించుకోవడం మానేశాను. చాలా మారాను. ఆ గంటన్నరలో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు. ఇదే విషయం దర్శకనిర్మాతలతో చెబితే ‘డబ్బు పెట్టేది మేము నీకెందుకు’ అంటారు. ఒకవేళ ఇదే విషయం హీరోలు చెబితే వాళ్లకు ఇలాంటి సమాధానం చెప్పరు. ఇండస్ర్టీలో మాత్రమే కాదు.. బయట కూడా ఇదే పరిస్థితి ఉంది. మహిళలను ఇలానే చూస్తారు’ అని అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. పరదాతోపాటు బైసన్‌, కిష్కిందపురి చిత్రాల్లో నటిస్తోంది అనుపమ.

ALSO READ: Coolie Review: రజనీకాంత్ 'కూలీ' మెప్పించిందా  

Ponnambalam: ల‌క్ష ఇస్తార‌నుకుంటే.. చిరంజీవి కోటి ఇచ్చారు

Virgin Boys OTT: ఆ ఓటీటీకి వ‌స్తోన్న‌.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే

Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే


Updated Date - Aug 14 , 2025 | 07:57 PM