scorecardresearch

నన్ను ప్రశాంతంగా ఉండనీయండి : సమంత

ABN , First Publish Date - 2021-10-08T22:29:19+05:30 IST

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ ఇద్దరి పెర్సనల్ వ్యవహారంపై ఎవరికి తోచిన కథనాల్ని వారు రాసిపడేస్తుండడంతో అది సామ్ కు బాధాకరంగా మారింది. అందుకే సమంతా తాజాగా నెటిజెన్స్ ను అభ్యర్ధిస్తూ ట్వీట్ చేసింది. ‘నా వ్యక్తి గత సమస్య పై మీరు చూపిస్తున్నశ్రద్ధకి నేను ధన్యురాల్ని. మీరు వ్యాప్తి చేస్తున్న రూమర్స్. తప్పుడు కథనాలు నన్ను బాధిస్తున్నాయి.

నన్ను ప్రశాంతంగా ఉండనీయండి : సమంత

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య,  సమంతల విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ ఇద్దరి పెర్సనల్ వ్యవహారంపై ఎవరికి తోచిన కథనాల్ని వారు రాసిపడేస్తుండడంతో అది సామ్ కు బాధాకరంగా మారింది. అందుకే సమంతా  తాజాగా  నెటిజెన్స్ ను అభ్యర్ధిస్తూ ట్వీట్ చేసింది. ‘నా వ్యక్తి గత సమస్య పై మీరు చూపిస్తున్నశ్రద్ధకి నేను ధన్యురాల్ని.  మీరు వ్యాప్తి చేస్తున్న రూమర్స్. తప్పుడు కథనాలు నన్ను బాధిస్తున్నాయి. నాకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలంటే ఇష్టం లేదని, అవకాశవాదినని, ఇంకా నేను అబార్షన్ చేయించుకున్నానని ఇలా రకరకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. విడాకులు తీసుకోవడం నాకూ బాధగానే ఉంది. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనీయండి’.. అంటూ సామ్ ట్వీట్ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. 



Updated Date - 2021-10-08T22:29:19+05:30 IST