అద్భుతమైన ఓపెనింగ్స్‌ వస్తాయనే నమ్మకం ఉంది

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:49 AM

‘ఓ అపర కుబేరుడు, బిచ్చగాడికి మధ్య ఇంటిలిజెన్స్‌ మైండ్‌ గేమ్‌ నేపథ్యంలో సాగే చిత్రం ‘కుబేర’. అసలు వారిద్దరూ ఒకరికొకరు ఎలా తారసపడ్డారు, వారి మధ్య పోరుకు...

సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌

‘ఓ అపర కుబేరుడు, బిచ్చగాడికి మధ్య ఇంటిలిజెన్స్‌ మైండ్‌ గేమ్‌ నేపథ్యంలో సాగే చిత్రం ‘కుబేర’. అసలు వారిద్దరూ ఒకరికొకరు ఎలా తారసపడ్డారు, వారి మధ్య పోరుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్న హిందీలో కూడా పాపులర్‌ స్టార్స్‌. అందుకే మా చిత్రాన్ని హిందీలో కూడా డబ్‌ చేసి విడుదల చేస్తున్నాం. మొత్తం 1600కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అద్భుతమైన ఓపెనింగ్స్‌ వస్తాయనే నమ్మకం ఉంది’ అని నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. వారిద్దరూ నిర్మాతలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వారిద్దరూ మీడియాతో ముచ్చటించారు.

  • శేఖర్‌ కమ్ముల మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్‌. ఆయన మంచి ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని టచ్‌ చేస్తూ ఉండే సినిమాలు తీస్తారు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రం తర్వాత శేఖర్‌ కమ్ముల ‘కుబేర’ కథను మాకు చెప్పారు. తర్వాత ధనుష్‌ కూడా ఓకే చేయడంతో సినిమా మొదలుపెట్టాం. ‘కుబేర’ సినిమా అద్భుతంగా వచ్చింది. భావోద్వేగాలతో పాటు వాణిజ్యహంగులు కలబోసిన చిత్రం ఇది. ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది.


  • తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సారి అగ్రతారలతో శేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదొక డిఫరెంట్‌ మూవీ. సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన పాయింట్‌ను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. సినిమాలో అధికభాగం రియల్‌ లొకేషన్లలో చిత్రీకరించడం సవాల్‌గా అనిపించింది. ముంబైలోని మురికివాడలు, డంపింగ్‌ యార్డ్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఇందులో ధనుష్‌ బిచ్చగాడిగా సాహసోపేతమైన పాత్రలో నటించారు. ఆయన ఆహార్యం, లుక్‌, భాష, ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ధను్‌షను తప్ప ఈ పాత్రలో మరొకర్ని ఊహించుకోలేం. ఈ చిత్రంలో ధనుష్‌ రెండు పాటలు పాడారు. దేవిశ్రీ నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేకాకర్షణ. నాగార్జున అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. శేఖర్‌ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాం.


Updated Date - Jun 13 , 2025 | 01:49 AM