గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:37 AM

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు...

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్‌ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.

బర్కత్‌పుర, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 13 , 2025 | 01:37 AM