వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా తొలి తమిళ సినిమా.. డిసెంబర్ 4న 'హలో కాదల్'

ABN, Publish Date - Oct 12 , 2026 | 06:00 PM

వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న తొలి తమిళ సినిమా 'హలో కాదల్'. ఆర్య హీరోగా నిఖిల్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ డిసెంబర్ 4, 2026న విడుదల కానుంది.

తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య నటించిన 'ఎపిక్‌' సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో తాను నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'హలో కాదల్' పైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది. అయితే వైష్ణవీ చైతన్యకు ఇది మొదటి తమిళ సినిమా కాదు. గతంలో అజిత్‌ నటించిన 'వాలిమై' చిత్రంలో వైష్ణవి చైతన్య నటించింది. కానీ ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా మాత్రం ఇదే! హీరో ఆర్య సరసన 'హలో కాదల్‌'లో మలయాళీ నటి నిఖిల విమల్‌ మరో కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా మూవీ టైటిల్‌ టీజర్‌ ను మేకర్స్ ప్రకటించారు. ఈ యేడాది డిసెంబర్‌ 4న 'హలో కాదల్' విడుదల కాబోతోంది. ఇది ఆర్య నటిస్తున్న 40వ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిఖిల్‌ మూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆర్య సమర్పకుడు అయితే అతని భార్య సాయేషా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం

Ganesh Acharya: గణేష్‌ ఆచార్య జీవితంలో ఇన్ని కష్టాలా? బయోపిక్‌ ట్రైలర్‌ ఆసక్తికరం!

Updated at - Oct 12 , 2026 | 06:03 PM