Anupama Paramwswaran: అప్పుడు సాయిపల్లవిని చంపాలనిపించింది..
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:57 PM
మలయాళ కల్ట్ క్లాసిక్ ప్రేమమ్ (Premam) సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).
మలయాళ కల్ట్ క్లాసిక్ ప్రేమమ్ (Premam) సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi), మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian)లతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత తెలుగులో అనుపమ స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె క్రేజీ కళ్యాణం సినిమాలో నటిస్తోంది. అక్టోబర్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనుపమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి సంబంధించిన విషయాలే కాక ప్రసనల్ విషయాలను కూడా పంచుకుంది. తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో ప్రేమమ్ సినిమా విజయం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ గురించి గురించి చెప్పుకొచ్చింది.
"ప్రేమమ్ రిలీజ్ తర్వాత సాయిపల్లవిని చంపాలనిపించింది.. కోపంతో కాదు సుమా.. అంటూ సరదాగా వ్యాఖ్యానించిన ఆమె, ఆ తర్వాత తీవ్రమైన మానసిక వేదనను అనుభవించినట్లు తెలిపింది. సినిమాలో సాయిపల్లవి, మడోన్నా పాత్రలు ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని, కానీ తాను మాత్రం సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తానని, అందులోనూ 10 నిమిషాలు పాటలే ఉంటాయని చెప్పింది. 'ఆ పాటలు ఆల్రెడీ మనం చూసేసాం కదా.. ఈ 5 నిమిషాల పాత్ర కోసం ఈ అమ్మాయికి ఇంత యాటిట్యూడ్ అవసరమా?' అంటూ ఆ కాలంలో తనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైందని ఆమె గుర్తుచేసుకుంది.
సినిమా కోసం తాను పెట్టిన ఎఫర్ట్స్‌కు, వచ్చిన రిజల్ట్‌కు పొంతన లేకపోవడంతో పాటు కేవలం 18 ఏళ్ల వయస్సులో అంత పెద్ద ట్రోలింగ్‌ను తట్టుకోవడం తనకు చాలా కష్టంగా మారిందని తెలిపింది. కానీ, ప్రేమమ్ తన లైఫ్ ని ఛేంజ్ చేసిన సినిమా అని చెప్పిన అనుపమ ఆ సంఘటనల వల్లే తాను నెగెటివిటీకి దూరంగా ఉండటం నేర్చుకున్నానని, అప్పట్నుంచే తన జీవితంలో డిటాచ్‌మెంట్ మొదలైందని స్పష్టం చేసింది. 'మన పని మనం చేయాలి.. రిజల్ట్ అనేది పట్టించుకోకూడదు. మనకు డిజర్వ్ అయితే విజయం వస్తుంది. లేకపోతే లేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.